
క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్ :- సాధారణంగా మహిళలు ఉపయోగించే హ్యాండ్ బ్యాగ్ వందల్లో లేదా వేళల్లోనూ ఉండొచ్చు. అదే కాస్త డబ్బున్న సెలబ్రిటీలు అయితే లక్షల్లో పెట్టి హ్యాండ్ బ్యాగ్ వినియోగిస్తూ ఉండవచ్చు. కానీ దేశంలో అబర కుబేరుడైనటువంటి ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. తాజాగా మనీష్ మల్హోత్రా దీపావళి వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగానే నీతూ అంబానీ కి కూడా ఇన్విటేషన్ రావడంతో ఆమె ఈ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ఈ వేడుకల్లో పాల్గొన్న మిగతా వారందరూ చూపు నీతా అంబానీ హ్యాండ్ బ్యాగ్ పై పడింది. ఎందుకంటే నీతా అంబానీ తన చేతిలో ఉన్నటువంటి చిన్న బ్యాగ్ ఖరీదు ఏకంగా 17.73 కోట్లు. ఈ చిన్న హ్యాండ్ బ్యాగ్ ని చూసిన ప్రతి ఒక్కరు కూడా మైండ్ బ్లోయింగ్ వర్మ… కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ అంటూ జైలర్ మూవీలో డైలాగులు వాడుతున్నారు.. సోషల్ మీడియాలో ఈ బ్యాగ్ ఫోటోలను చూస్తూ ప్రతి ఒక్కరు కూడా పలువురికి షేర్ చేస్తూ సంబరపడిపోతున్నారు.
” HERMES SAC BIJOU BIRKIN “ కి చెందినటువంటి అత్యంత ఖరీదైన ఈ బ్యాగ్ తయారీకి ఏకంగా 3,025 డైమండ్స్ ను వాడారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ బ్యాగ్ ని చూస్తున్న నెటిజెన్స్ చాలా బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు చేతికి ఉపయోగించే బ్యాగుకు అంత ఖరీదు పెట్టాల్సిన అవసరం ఏందంటూ కొంతమంది నీతా అంబానీని ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా 3025 డైమండ్లతో ఉపయోగించిన ఈ బ్యాగ్ చూడడానికి చాలా అద్భుతంగా, మెరుస్తూ కనిపిస్తుంది. మరి దేశంలోనే కుబేరుడు అయినటువంటి ముఖేష్ అంబానీ సతీమణి ఇలాంటివి వాడడం మొదటిసారేమీ కాదు.
Read also : వాళ్ళిద్దరు ఆడుతారని గ్యారంటీ అయితే ఇవ్వలేను : గౌతమ్ గంభీర్
Read also : హస్తినాపురం అగ్రికల్చర్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత లేమి!