Monday, February 23, 2026
Homeఆంధ్ర ప్రదేశ్రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం.. నాలుగు కు చేరిన మృతుల సంఖ్య!

రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం.. నాలుగు కు చేరిన మృతుల సంఖ్య!

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని లాలాచెరువు ఏరియాలో కల్తీ పాల వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏరియాలో కల్తీ పాలు తాగడం వల్ల మనుషులు చనిపోయారు. నిన్నటి రోజున చాలామంది వ్యక్తులు అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరిన వారిలో ఒకరు చనిపోయారు. బాధితుల్లో మొత్తం 60 నుంచి 70 ఏళ్ల వయసున్న వారు ఉన్నారు అని తోటి ప్రజలు చెబుతున్నారు. ఈ కల్తీ పాలు తాగడం వల్ల పలువురు కిడ్నీలు కూడా పాడైపోయినట్లు సమాచారం అందగా ఆ పాలను ఆరోగ్యశాఖ అధికారులు సేకరించి పరీక్షలకు పంపారు. తాజాగా ఈ రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.ప్రస్తుతం వెంటిలేటర్ పై 9 మందికి పైగా చికిత్స అందిస్తున్నట్లు అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటన జరగడానికి కారకుడైనటువంటి పాల వ్యాపారిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చనిపోయిన వ్యక్తులకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ కల్తీ పాల వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగుతోంది.

గోవర్ధనగిరిధారిగా నారసింహుడు

ఈ జిల్లాల్లో మరో మూడు గంటల్లో భారీ వర్షాలు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments