ఆంధ్ర ప్రదేశ్

వైఎస్‌ అవినాష్‌ రెడ్డి అరెస్ట్‌, పులివెందులలో టెన్షన్ టెన్షన్!

MP Avinash Reddy Arrest: పులివెందులలో టెన్షన్ వాతావరణ నెలకొంది. కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తెల్లవారుజామునే అతడి ఇంటికి వచ్చిన పోలీసులు, అతడిని బలవంతంగా పోలీసులు వాహనంలోకి ఎక్కించుకుని  తీసుకెళ్లారు. అనంతరం అతడిని కడప పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అరెస్ట్‌ సమయంలో హైడ్రామా

అరెస్ట్‌ సమయంలో హైడ్రామా చోటు చేసుకుంది. పోలీసులతో అవినాష్‌ రెడ్డి వాగ్వాదానికి దిగారు. తాను జ్వరంతో బాధపడుతున్నానని, ఇంట్లోనే ఉంటానంటూ చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చారు. ఇంటి బయటే ఆయన బైఠాయించగా.. అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. అవినాష్‌ అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వాళ్లనూ అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో అరెస్ట్

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అవినాష్ రెడ్డిని అరెస్టు చేశారు. ఇప్పటికే టీడీపీ దాడులను ఖండిస్తూ ఈ నెల 5న వైసీపీ ర్యాలీ చేపడ్డటంతో అవినాష్‌ రెడ్డి సహా 150 మందిపై కేసు పెట్టారు. అయితే, ఈ కేసుల్లో ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించింది. అయితే, పోలింగ్‌ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా ఈ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: పులివెందుల ఫైట్‌లో గెలుపెవరిది.. జగన్‌ అడ్డాలో ఏ జెండా ఎగరబోతోంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button