తెలంగాణ

జూబ్లీహిల్స్‌ బైపోల్‌ బరిలో మెగాస్టార్‌ చిరంజీవి..?

క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో :- జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో మెగాస్టార్‌ చిరంజీవి పోటీ చేస్తున్నారా..? కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారా…? సీఎం రేవంత్‌రెడ్డితో చిరంజీవి భేటీ వెనుక అసలు విషయం ఇదేనా..? ఎన్నికల బరిలోకి దిగాలని రేవంత్‌రెడ్డే చిరంజీవిని కోరారా..? ఇందులో వాస్తవం ఎంతుందో గానీ.. బీఆర్‌ఎస్‌ నాయకులు మాత్రం.. ఇదే నిజమని ప్రచారం మొదలెట్టేశారు.

Read also : ఇప్పట్లో జగన్‌ అరెస్ట్‌ లేనట్టే – వెనక్కి తగ్గిన కూటమి..!

రానురానంటూనే… మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సందర్భం లేకుండా… ఈ భేటీ ఏంటని అందరూ చెవులు కొరుక్కున్నారు. మర్యాదపూర్వకంగా కలిశారని బయటికి చెప్పినా… ఇప్పుడే ఎందుకు..? అన్న ప్రశ్న మాత్రం రాకమానదు కదా..? ఆ ప్రశ్నలో నుంచి ఎన్నో జవాబులు పుట్టుకొస్తున్నాయి. వాటిలో ఒకటి జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక. ఆ సీటు కోసం కాంగ్రెస్‌లో చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. అయితే సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహం మరోలా ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ వ్యూహంలో భాగమే… రేవంత్‌రెడ్డి-చిరంజీవి భేటీ అంటూ చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ వ్యూహం ఏంటో తెలుసా…?

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో చిరంజీవిని నిలబెడితే.. విజయం కాంగ్రెస్‌దే అని సీఎం రేవంత్‌రెడ్డి నమ్ముతున్నారట. అందుకే చిరంజీవిని నిలబెట్టాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. రేవంత్‌రెడ్డి-చిరంజీవి భేటీలో ఈ విషయంపైనే చర్చించాలని గులాబీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. రాజకీయాలకు దూరంగా.. సినిమాలో బిజీగా ఉంటున్న చిరంజీవిని మళ్లీ పాలిటిక్స్‌లో తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారట. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలలో చిరంజీవిని కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలబెడితే కచ్చితంగా విజయం సాధిస్తామన్న ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్టు సమాచారం. చిరంజీవి ముందు ఈ ఆఫర్‌ ఉంచారన్న రేవంత్‌రెడ్డి. అయితే… దీనికి మెగాస్టార్‌ ఉ అంటారా?.. ఊహూ అంటారా? అన్నది తేలాలంటున్నారు.

Read also: “అరుంధతి” కోటకు మరమ్మత్తులు చేపట్టాలి?

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక టికెట్‌ కోసం కాంగ్రెస్‌లో చాలా మంది నేతలు కాచుకుని కూర్చోనుంటే…. చిరంజీవిని సెలక్ట్‌ చేసి.. ఆయన ముందు ఈ ఆఫర్‌ పెట్టడమేంటి..? ఇది నిజమేనా..? అని చాలా మంది చర్చించుకుంటున్నారు. నిజమో కాదో పక్కనపెడితే…రేవంత్‌రెడ్డి పక్కా లెక్కలతోనే ఈ ఆఫర్‌ ఇచ్చుండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో ఇప్పటికీ బీఆర్‌ఎస్సే ముందంజలో ఉందని సమాచారం. ఈ సమయంలో… ఆ ఎన్నిక గెలవాలంటే… చిరంజీవి అయితేనే సరైన అభ్యర్థి అని రేవంత్‌రెడ్డి ఆలోచనగా చెప్తున్నారు. ఈ ఎన్నికలో చిరంజీవి నిలబడి… విజయం సాధిస్తే.. ఆయన హోంమంత్రి పదవి కూడా ఆఫర్‌ చేసినట్టు సమాచారం.

Read also : జగన్ అడ్డాలో హై టెన్షన్.. గాయాల పాలైన వైసీపీ ఎమ్మెల్సీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button