జాతీయంతెలంగాణ

నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో (యువ తేజం)మెగా జాబ్ మేళా

క్రైమ్ మిర్రర్, నల్గొండ బ్యూరో :- నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “యువ తేజం” కార్యక్రమంలో భాగంగా ఈనెల 5వ తారీకు శనివారం ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ కంపెనీల ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇట్టి జాబ్ మేళా లో వందకు పైగా కంపెనీలు, 2500 వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని, జాబ్ లో సెలెక్ట్ అయిన వారందరికీ వారి అర్హతలను బట్టి కనీస జీతం 13000/- రూపాయలు గా ఉంటుందని, కావున ఈ అద్భుత అవకాశాన్ని జిల్లాకు సంబంధించిన నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.

అర్హతలు..

పదవ తరగతి/ ఇంటర్/డిప్లమా/ఫార్మసీ/డిగ్రీ/ ఇంజనీరింగ్/పీజీ స్థాయి విద్యార్థులు వయస్సు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు లోపు వారు వారి యొక్క వివరాలను వారి సమీప పోలీస్ స్టేషన్లో వెంటనే నమోదు చేసుకోవాలి.

  1. మైం హోంలో బుల్డోజర్లు దింపు.. రేవంత్‌కు కవిత సవాల్

  2. మైం హోంలో బుల్డోజర్లు దింపు.. రేవంత్‌కు కవిత సవాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button