
రామకృష్ణాపూర్, క్రైమ్ మిర్రర్:-తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం, హైదరాబాద్ ఆదేశాల మేరకు జనవరి 1న క్యాతనపల్లి పురపాలక సంఘం పరిధిలోని 22 వార్డులకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా అధికారికంగా విడుదల చేశారు.ఈ ముసాయిదా ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీల సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం క్యాతనపల్లి పురపాలక సంఘం కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలను అధికారులకు తెలియజేశారు.
Read also : రిజర్వేషన్లపైనే మున్సిపల్ నాయకుల చూపు..!
Read also : Breaking: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడో తెలుసా..?





