తెలంగాణ

రుస్తుంపేటలో వీధి కుక్కల స్తైర విహారం...12 సంవత్సరాల బాలుడి పై దాడి..

హత్నూర, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి:- నర్సాపూర్ మండలం రుస్తుంపేట గ్రామంలో సంధిల అభిలాష్ అనే 12 సంవత్సరాల బాలుడు పై వీధి కుక్కల గుంపు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. తన మిత్రులతో ప్లే గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుండగా అటువైపుగా వచ్చిన కుక్కల గుంపు అభిలాష్ పై దాడి చేయగా అతని మిత్రులు భయపడి పక్కకు వెళ్లారు.

ఒంటరిగా ఉన్న అభిలాష్ పై నాలుగు కుక్కలు ఒకేసారి దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. విషయం తెలుసుకున్న అతని అన్న వెంటనే అక్కడికి వెళ్లి కుక్కల నుండి తన తమ్ముడి ని విడిపించాడు. తన తమ్ముని గాయలను చూసి వెంటనే తల్లిదండ్రులకు తెలియజేశానని తెలిపారు. గాయపడిన అభిలాషను వెంటనే నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా డాక్టర్ల సలహా మేరకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాలునికి చికిత్స అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి …

  1. జేఈఈ విద్యార్థుల వివాదం – నిజం నిగ్గుతేలుస్తానన్న పవన్‌..!

  2. అమ్మో.. జగన్‌ అడ్డానా వద్దు వద్దు – ఈసారికి కడప చాలు..!

  3. దిల్ షుగ్ నగర్ లో బాంబ్ బ్లాస్ట్.. 12 ఏళ్లుగా ఏం జరిగింది. 

  4. కదులుతున్న రైలు బాత్రూంలో అత్యాచారయత్నం! 

Back to top button