
క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా,ఆత్మకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో మంగళవారం రోజున గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిణి డాక్టర్ అమరావతి ప్రజలకు సేవలందించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సిహెచ్ఓ)రాకేష్ సింగ్, ఏఎన్ఎం జయలక్ష్మి, ఆశాకార్యకర్త ఆర్ రజిత, పంచాయతీ కార్యదర్శి సిహెచ్ జనరంజన్, అంగన్వాడీ టీచర్ బి వైష్ణవి, ఏఫ్ఏ ఎన్ రవిందర్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం వైద్య అధికారిణి ప్రజలకు ఆరోగ్యం గురించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు.





