క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మేడ్చల్ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్ ఎదుట విద్యార్థినిలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. హాస్టల్ బాత్ రూముల్లో సీసీ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థినిలు ఆందోళన బాట పట్టారు. తాము స్నానం చేస్తుండగా.. వీడియోలు రికార్డు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్థినిల ఆందోళనతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు. అయితే హాస్టల్‌లో వంట చేసే వారిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కాగా, బాత్ రూముల్లో సీసీ కెమెరాలు పెట్టారంటూ నిన్న(బుధవారం) రాత్రి నుంచి విద్యార్థినిలు ఆందోళనకు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎన్ఎస్‌యూఐ నాయకులు విద్యార్థినిలను కలిశారు.
Read Also : వృద్ధులు, దివ్యాంగులకు గుడ్ న్యూస్.. నేరుగా శ్రీలక్ష్మీ నరసింహుడిని దర్శించుకునే భాగ్యం
అనంతరం వారితో కలిసి నేడు హాస్టల్ ఎదుట మళ్లీ నిరసనకు దిగారు. నిందితులను తక్షణమే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. వి వాంట్ జస్టీస్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తున్నారు. హాస్టల్ వార్డెన్ ప్రీతి బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు టీవీలు, వార్తాపత్రికల ద్వారా విషయం తెలుసుకున్న విద్యార్థినిల తల్లిదండ్రులు హుటాహుటిన కళాశాల వద్దకు చేరుకున్నారు. దీంతో కన్నవారిని చూసిన విద్యార్థినిలంతా బోరున విలపించారు. తమకు అన్యాయం జరిగిందంటూ అంతా కలిసి పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. మరోవైపు మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి తన సిబ్బందితో కలిసి హుటాహుటిన సీఎంఆర్ కళాశాల వద్దకు చేరుకున్నారు. విద్యార్థినిలతో మాట్లాడి ఆందోళన విరమించాలని కోరారు. అయితే నిందితులను పట్టుకునే వరకూ నిరసన విరమించేది లేదని యువతులు తేల్చి చెప్పారు. దీంతో విద్యార్థినిల తల్లిదండ్రులతో ఏసీపీ మాట్లాడారు. ఆందోళన విరమించేలా నచ్చచెప్పాలని విజ్ఞప్తి చేశారు. అయితే విద్యార్థినిలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ మేరకు నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి :