
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- మన భారత దేశంలోనే గిరిజనుల అతిపెద్ద పండుగ తెలంగాణలోని ములుగు జిల్లా, మేడారంలో జరుగుతుంది. ఈ మేడారం మహా జాతరకు ఇప్పటికే దాదాపు కొన్ని లక్షల మంది భక్తులు సమ్మక్క-సారక్కను దర్శించుకోగా తాజాగా ఆలయ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం సుమారు మూడు కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అన్నారు. కాబట్టి ఇంతటి భారీ జన సమూహంలో పిల్లలు మరియు వృద్ధుల పట్ల ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి అని అధికారులు సూచిస్తున్నారు. ఈ మహా జాతరలో ముఖ్యంగా పిల్లలపై తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలి అని.. లేదంటే కచ్చితంగా తప్పిపోయే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. కాబట్టి ముందస్తు జాగ్రత్తగా పిల్లలు,వృద్ధుల జేబులలో సెల్ ఫోన్ నెంబర్లు రాసిన కాగితాలను ఉంచడం.. లేదా వారి చేతిపై ఊరి పేరు లేదా ఫోన్ నెంబర్లను రాసి ఉంచాలి అని కోరారు. ఒకవేళ ఈ జాతరలో తల స్నానాలు చేసినప్పుడు అవి చెడిపోకుండా ఉండాలి అంటే జాతరకు వచ్చే ముందు రోజే వారి చేతిపై గోరింటాకుతో ఫోన్ నెంబర్ ను రాయండి. మరోవైపు మీ సెల్ ఫోన్లు అలాగే నగదు పట్ల కూడా జాగ్రత్త వహించండి. మేడారం ఆలయ అధికారులు ఇప్పటికే భక్తులకు సంబంధించి అన్ని భద్రత చర్యలను చేపట్టారు. ఇటువంటి కొన్ని చిట్కాలను పాటించడం వల్ల పిల్లలు లేదో అభివృద్ధిలు తప్పిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మరోవైపు మీతో పాటు తీసుకు వెళ్లినటువంటి లగేజ్ల పై కూడా ఒక కన్ను వేసి ఉంచాలి. ఈ మేడారం మహా జాతర ఈనెల 31వ తేదీ వరకు జరుగుతుంది.
Read also : ఏంటి అభి భాయ్.. 12 బంతుల్లోనే 50 చేయాల్సింది : యువరాజ్ సింగ్
Read also : పురుషుల కంటే స్త్రీలకే ఆ కోరికలు ఎక్కువ?





