
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- హైదరాబాద్ లో నిన్న రాత్రి భారీ అగ్నిప్రమాదమే చోటు చేసుకుంది. ఈ భారీ అగ్ని ప్రమాదం దాటికి షాప్ లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా పేలిపోయాయి. ప్రస్తుతం ఈ విజువల్స్ అక్కడున్నటువంటి స్థానికులను పూర్తిగా భయాందోళనకు గురిచేశాయి. ఇక అసలు వివరాలు లోకి వెళితే.. హైదరాబాద్ పాదబస్తీలోని శాలిబండలో ఈ భారీ అగ్ని ప్రమాదపు ఘటన చోటుచేసుకుంది. గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూం లో పెద్ద ఎత్తున ఒక్కసారిగా మంటలు చల రేగడంతో ఒకసారి గా షో రూమ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వస్తువులన్నీ కూడా పూర్తిగా పేలుతూ కాలిపోయాయి. ఇక వెంటనే స్థానికులు ఫైర్ ఇంజన్ కు ఫోన్ చేయగా వారు 10 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పి వేశారు. ఇక ఇదే సమయంలో ఇతర భవనాలకు ఈ మంటలు వ్యాపించకుండా వారు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మంటలు చెలరేగుతున్న సమయంలో షోరూం ఎదుట ఉన్నటువంటి బ్రాండెడ్ కారు సైతం పూర్తిగా కాలిపోయింది. ఒక్కసారిగా మంటలు భారీగా వ్యాపించడంతో పాటు భారీ శబ్దాలు రావడంతో స్థానికులు ఆ చోటు నుంచి భయంతో దూరంగా పరుగులు తీశారు. ఇక ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదు కానీ ఒక వ్యక్తికి మాత్రం తీవ్రంగా గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆ వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చి చికిత్సను అందిస్తున్నారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటన ఎలా చోటు చేసుకుంది అనేది విచారణ చేపట్టారు.
Read also : మా ఇద్దరిదీ ఒకే రాశి.. అందుకే వైబ్ కుదిరింది : హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే
Read also : రైతులకు గుడ్ న్యూస్… తడిసిన ధాన్యం కూడా కొనుగోళ్లు!





