
క్రైమ్ మిర్రర్, ఛత్తిస్ ఘడ్:- ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. కాగా, ఈ ఘటన ఇవాళ (శుక్రవారం) ఉదయం దంతెవాడ- బీజాపూర్ సరిహద్దు అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. దంతెవాడ- బీజాపూర్ సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై పోలీసులకు సమాచారం అందడంతో ప్రత్యేక దళాలు కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో రెండు వర్గాలు ఎదురుపడ్డాయి. దీంతో ఇరువైపులా కాల్పులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయి మరణించారు. సంఘటనా స్థలంలో ఆయుధాలు, బుల్లెట్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు భద్రతా దళాలు. ఈ ఎన్‌కౌంటర్ తర్వాత అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కాగా, మృతిచెందిన మావోయిస్టుల గుర్తింపు పనులు కొనసాగుతున్నాయి.
Read also తెలంగాణలో టీడీపీ బలపడే ఛాన్స్ ఉందా.. రేవంత్‌రెడ్డి ఏం చెప్పారంటే?
Read also : కల్వకుంట్ల కాదు దేవనపల్లి.. కవిత ఇంటిపేరు మార్చేసిన బీఆర్‌ఎస్..!