
రామకృష్ణాపూర్,క్రైమ్ మిర్రర్:-
రాష్ట్రవ్యాప్తంగా పురపాలక శాఖలో జరిగిన బదిలీల్లో భాగంగా క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్‌గా ఏ.మారుతి ప్రసాద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గత కమిషనర్ జి.రాజు అదిలాబాద్‌కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో మారుతి ప్రసాద్‌ను నియమించారు. రామగుండం మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న మారుతి ప్రసాద్ పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పారదర్శక పాలన అందించడమే లక్ష్యమని తెలిపారు.





