
మర్రిగూడ, (క్రైమ్ మిర్రర్):-మర్రిగూడ ఉపాధి హామీకీ ఎవరైనా చేతబడి చేశారా.. లేదా చేజేతులా అధికారులే ఆగం చేస్తున్నారా అర్ధం కానీ పరిస్థితి ఏర్పడింది..!? చిల్లర పంచాయతీలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడంపై అనేక విమర్శలు వినపడుతున్నాయి..!? అవినీతి సొమ్ము పంపిణిలో వాటాలు..హెచ్చు తగ్గులు ఉన్నాయా.. లేక వాటాలు పంచడంలో ఇబ్బంది ఉందా అర్ధం కానీ పరిస్థితి ఏర్పడింది..!? గతంలో మర్రిగూడ ఉపాధి హామీ పనులు జిల్లాను శాసించే విధంగా ఉండేది.. కానీ ఇప్పుడున్న ఎంపిడివో నిర్లక్ష్యమా..లేక ఇంచార్జ్ ఏపివో పుణ్యమా తెలియదు కానీ, వ్యవస్థ మొత్తం చిల్లరకు మించి పోయిందంటున్నారు.
స్థానికులు.. ఊ అంటే పోలీస్ స్టేషన్, ఆ అంటే పోలీస్ స్టేషన్ ఇదేనా ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే క్రమ శిక్షణ..!? ఎవరికీ వారే తోపులమని విర్రవీగుతూ, ఉపాధిని ఊపిరి లేకుండా చేస్తున్నారు సిబ్బంది..!? క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది సైతం వర్గాలుగా మారి రాజకియం చెయ్యటం సిగ్గు చేటంటున్నారు మండల ప్రజలు..!? పొద్దు మొత్తం పంచాయతీలకే సరిపోతే, ఇక ఉపాధి హామీ పనులు ఎలా చేపిస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
Also Read : మునుగోడు లో కల్తీ మద్యం తెచ్చింది ఆయన అనుచరులే.. !
కూలీలకు కనీస సౌకర్యాలు చూపించే దమ్ము లేదు కానీ, పంచాయతీలకు మాత్రం కాలు దువ్వుతున్నారు ఏమైనా ఉందా మీకు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు..!? మర్రిగూడలో జరిగే ఉపాధి హామీ పనులన్నీ, ఎంపిడిఓ కనుసైగల్లోనే నడుస్తున్నాయని అందరికి తెలిసిన విధితమే.. తానా అంటే తందానా అంటూ ఇంచార్జ్ ఏపివో వారికి వత్తాసంటూ గట్టి ప్రచారం..!? ఇంతకీ మండలంలో ఉపాధి సిబ్బందికి ఎవడైనా చేతబడి చేశారా..!? లేక మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నారా అనేది అర్ధం కాని పరిస్థితి అంటున్నారు మండల ప్రజలు..!? వర్గాలుగా మారి అధికారులు, సిబ్బంది ప్రజలకు ఒరగబెట్టేది ఏంటని ప్రశ్నిస్తున్నారు.
నిపుణులు..!? మండలంలో ఉన్న రాజకీయం మొత్తం, ఉపాధి సిబ్బంది రాజకీయానికి ఏమాత్రం సరిపోదంటున్నారు చాలా మంది.!? ఉపాధి హామీలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా అంగడి సరుకు చేసిన గనులు ఎవ్వరిని, దిగజారి పనులు అధికారులకు సెట్ కాదని హితోపదేశం చేస్తున్నారు స్థానిక నాయకులు!? జరగని పనులకు బిల్లులు ఇవ్వడం, వర్క్ చేంజ్ చెయ్యటం, ఫీల్డ్ విజిట్ చెయ్యక పోవటం, ఒకరిపై ఒకరు బాణాలు సంధించుకోవటం నేడు మర్రిగూడ ఉపాధి హామీ పనులలో పిల్లల పరాశకంగా మారింది..!? మొన్న జరిగిన సామాజిక తనిఖీ సిబ్బంది పని తీరుపై దుమ్మెత్తి పోసిన సంగతి అందరికి తెలిసినదే..!? కొంతమంది బుడుబుంకల వారిని పట్టుకొని ప్రజలను ఇబ్బంది పెడితే, తస్మాత్ జాగ్రత్తని హెచ్చరిస్తున్నారు.
Also Read : చిన్న కొడుకుని ఎత్తుకుని ఇండియాకు వచ్చిన పవన్ కల్యాణ్
ప్రజా సంఘాల నాయకులు.. ఒక ప్రభుత్వ అధికారినని మరిచిపోయి గలీజ్ కూతలకు తెగబడిన వారికి తప్పక ప్రతిఫలం చూపిస్తామని అంటున్నారు.. ఇక్కడ ఉన్న ఉపాధి సిబ్బంధితో పాటు స్థానిక ఎంపిడివోను బదిలీ చేస్తే తప్ప ఉపాధి ఊపిరి పోసుకోదని నాయకులు సూచిస్తున్నారు..