
మందమర్రి,(క్రైమ్ మిర్రర్):- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అండర్–14 నెట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన మందమర్రి పట్టణానికి చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఈనెల 6న జరిగిన పోటీల్లో మంచిర్యాల జిల్లా జట్టు తరఫున ఆడిన హైదరాబాద్ కృష్ణవేణి టాలెంట్ పాఠశాల ఆరవ తరగతి విద్యార్థులు రాంటెంకి అశ్వద్, బెల్లం మనస్విలు ఉత్తమ ప్రదర్శన చేశారు. ఈ నెల 16 నుంచి 18 వరకు ఖమ్మంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వారు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సీఐ శశిధర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్‌లు విద్యార్థులను సన్మానించి అభినందించారు.
Read also : పోలీసుల బట్టల ఊడదీస్తాం.. BRS మాజీ ఎమ్మెల్యే వార్నింగ్ (VIDEO)
Read also : చుట్టాలు ఎక్కువగా ఉన్నారని చింతించకండి.. మీ కోసమే Nissan సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది





