ఆంధ్ర ప్రదేశ్

కూటమిలో నాగబాబు చిచ్చు - పిఠాపురంలో రాజుకున్న నిప్పు..!

నాగబాబు పిఠాపురం పర్యటన కూటమిలో చిచ్చు పెట్టిందా..? రెండు పార్టీల మధ్య రాజుకున్న అగ్నికి ఆజ్యం పోసిందా..? టీడీపీ, జనసేన వర్గాలు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ తలపడ్డాయా..? అంటే అక్కడి పరిస్థితి చూస్తే అలానే ఉంది. నాగాబాబుకు టీడీపీ కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలింది. నాగబాబు పర్యటనలో జైవర్మ అంటూ నినాదాలు మార్మోగాయి.

జనసేన ఎమ్మెల్సీ నాగబాబు… రెండు రోజుల పాటు పిఠాపురంలో పర్యటించారు. ఆ సందర్భంగా టీడీపీ-జనసేన మధ్య విభేదాలు బయటపడ్డాయి. రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు కనిపించింది. నిజానికి… జనసేన ఆవిర్భావ సభలో వర్మపై నాగబాబు వ్యాఖ్యలతో వివాదం రాజుకుంది. ఆ వివాదాన్ని పరిష్కరించేందుకు పార్టీల పెద్దలు ప్రయత్నించలేదు. దీంతో… పిఠాపురంలో కొంతకాలంగా టీడీపీ వర్సెస్‌ జనసేన అన్నట్టు రాజకీయం నడుస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేసి.. ఎమ్మెల్సీ ఆశించి భంగపడ్డ వర్మ.. నాగబాబు వ్యాఖ్యలతో బాగా హర్ట్‌ అయినట్టు ఉన్నారు. అందుకే.. పిఠాపురంలో కనిపించని అభివృద్ధిపై ఇటీవల గళమెత్తారు. ఆ తర్వాత… పిఠాపురంలో నాగబాబు పర్యటనలోనూ వర్మ వర్గం.. గట్టిగానే తమ నిరసన తెలిపింది.

నాగబాబు పర్యటనకు… టీడీపీ ఇన్‌ఛార్జ్‌ SVSN వర్మకు ఆహ్వానం అందలేదు. దీంతో… ఆయన వర్గం ఆగ్రహించింది. నాగబాబు పిఠాపురం పర్యటనకు వచ్చినప్పుడు తమ మార్క్‌ చూపించారు వర్మ అనుచరులు. కుమారపురలో అభివృద్ధి కార్యక్రమాలకు నాగబాబు శ్రీకారం చుడుతున్నప్పుడు… ఆయన వెంటే ఉండి జైవర్మ అంటూ నినాదాలు చేశారు టీడీపీ కార్యకర్తలు.


Also Read : టీడీపీ నెక్ట్స్‌ టార్గెట్‌ మాజీ మంత్రి రోజా – ఆడుదాం ఆంధ్రాలో అవినీతి పేరుతో కేసులు..?


వాస్తవంగా.. పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌కళ్యాణ్‌. ఆ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే… అటెండ్‌ కావాల్సింది ఎమ్మెల్యే స్థానంలో పవన్‌ కళ్యాణ్‌. మరి.. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టగానే నాగబాబు పిఠాపురం టూర్‌ ఎందుకు పెట్టుకున్నారు. పవన్‌ కళ్యాణ్‌ స్థానంలో ఉండి… ప్రారంభోత్సవాలు ఎందుకు చేస్తున్నారు..? అన్న ప్రశ్న కూడా మొదలవుతోంది. పైగా పిఠాపురంలో టీడీపీ కార్యకర్తలను కలుపుకుని పోయేలా నాగబాబు చేతలు ఉండటం లేదు. పిఠాపురంలో టీడీపీని పక్కనపెట్టాలన్నదే ఆయన ప్లాన్‌ అని వర్మ వర్గం భావిస్తోంది. ఈ కారణంగా కూటమిలో చిచ్చు రాజుకుంటోంది. పిఠాపురంలో టీడీపీ వర్సెస్‌ జనసేన అనేలా రాజకీయం మారిందంటే అందుకు నాగబాబే కారణమన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు… టీడీపీ, జనసేన అధినేతలు ప్రయత్నిస్తారా…? లేక ఆ చిచ్చు… చినికి చినికి గాలివానలా మారే వరకు కాలయాపన చేస్తారా..? అన్నది వారి చేతుల్లోనే ఉంది.

ఇవి కూడా చదవండి ..

  1. ఏపీ సచివాలయంలోని పవన్ కల్యాణ్ బ్లాక్ లో మంటలు

  2. అకడమిక్ క్యాలెండర్ విడుదల… సెలవులు దినాలు ఎప్పుడంటే?..

  3. హైదరాబాద్ కు రెడ్ అలెర్ట్.. మునిగిపోవడం ఖాయమా?

  4. సభలోనే తెలంగాణ మంత్రిని బూతులు తిట్టిన మహిళలు

  5. ప్రియునితో కలిసి.. కట్టుకున్న మొగున్నే కాటికి పంపిన భార్య..

Back to top button