![](https://b2466033.smushcdn.com/2466033/wp-content/uploads/2025/02/bird-flu-750x430-1.jpg?lossy=1&strip=1&webp=1)
తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వైరస్ కలవరపెడుతోంది… వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. తాజాగా ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన విషయం సంచలనం రేపుతోంది. బర్డ్ ఫ్లూ సోకినట్లుగా నిర్థారణ అవ్వడంతో జిల్లా వైద్య శాఖ అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు.
కోళ్ల ఫారం సమీపంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తిలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో అధికారులు అతడి శాంపిల్స్‌ను సేకరించారు. అక్కడే మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ తొలి కేసు నమోదైందని జిల్లా వైద్యశాఖ అధికారి వెల్లడించారు.