తెలంగాణ

వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి!..ఆస్పత్రి ముందు కుటుంబ సభ్యుల ఆందోళన

క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి:-
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో నివాసముంటున్న సయ్యద్ సాబేర్ (45) అనే వ్యక్తి గుండెపోటుతో శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన సయ్యద్ సాబేర్ అనే వ్యక్తి ఛాతి నొప్పి రావడంతో పట్టణంలోని శ్రీ వెంకటరమణ ఆసుపత్రికి వెళ్లారు.

అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్ వైద్య పరీక్షలు నిర్వహించి కొన్ని మందులు ఇచ్చి ఈసీజీ తీసి అంతా నార్మల్గానే ఉంది.. అని ఇంటికి తిరిగి పంపించారు. ఇంటికి వెళ్లిన కాసేపటికి సాబేర్ కుప్పకూలిపోవడంతో మళ్లీ అతన్ని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డ్యూటీ డాక్టర్ అప్పటికే సాబేర్ గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈసీజీ తీసినప్పుడు అందులో గుండె సమస్య ఉందని, ఆ విషయం డ్యూటీలో ఉన్న డాక్టర్ కి తెలియకుండానే తిరిగి ఇంటికి పంపించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈసీజీ తీసినప్పుడే సమస్య చెప్పి ఉంటే మేము మెరుగైన వైద్యం కోసం వెళ్లే వాళ్ళమని వైద్యుల నిర్లక్ష్యం వల్లే సాబేర్ మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. అసలు ఈసీజీలో ఏముందో కూడా చూడలేని అర్హత లేని డాక్టర్ను రాత్రి వేళల్లో డ్యూటీలో పెట్టి ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని, ఇలాంటి ప్రైవేటు ఆసుపత్రులపై వైద్యశాఖ ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆసుపత్రిలో మృతుడి బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. మృతునికి ముగ్గురు కుమారులు ఉన్నారు.

Read also : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్ – అఖల్ దేవ్‌సర్‌లో ఓ ఉగ్రవాది హతం

Read also : చౌటుప్పల్‌లో రోడ్డు ప్రమాదం.. బోనాల పండుగకు వెళ్తున్న ఆటోను ఢీకొన్న లారీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button