క్రైమ్ మిర్రర్,మంగపేట తమ ఉపాధ్యాయుడి డిప్యూటేషన్ ను నిరసిస్తూ విద్యార్థులు వారి తల్లితండ్రులతో కలిసి మా సారు…మాకే కావాలని బుధవారం పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. మండలంలోని అఖినేపల్లి మల్లారం ప్రాధమికోన్నత పాఠాశాలలో 50 విద్యార్థులు చదువుతుండగా 5గురు ఉపాధ్యాయులతో నాణ్యమైన బోధన అందుతున్న క్రమంలో హిందీ పండిట్ ప్రవీణ్ కుమార్ డిప్యూటేషన్ లేకున్నా తన స్వలాభం కోసం వేరే పాఠశాలకు వెళ్లాడని ఇలా మద్యాంతరంగా ఇష్టం ఉన్నట్టు డిప్యూటేషన్ పై వెళితే పిల్లల చదువు ఎం కావాలని తల్లి తండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
హిందీ సబ్జెక్ట్కు ఉపాధ్యాయులు లేకపోవడంతో ఉన్న ఉపాధ్యాయులు అన్ని తరగతులకు హిందీ సబ్జెక్టు బోధించడం ఇబ్బంది కరంగా ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు.ఇకనైనా అధికారులు స్పందించి డిప్యూటేషన్ పై వెళ్లిన హిందీ పండిట్ ఉపాధ్యాయుడి డిప్యూటేషన్ ను రద్దు చేసి తిరిగి పాఠశాలకు రప్పించి విద్యార్థుల చదువులను కాపాడాలని తల్లితండ్రులు కోరుతున్నారు. ఈ విషయం పై క్రైమ్ మిర్రర్ రిపోర్టర్ మండల విద్యాశాఖ అధికారిని పోదేం మేనకను వివరణ అడిగేందుకు ఫోనులో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
ఇవి కూడా చదవండి
2.తిరుమల వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కు ధరించాలి!..
3.తెలంగాణలోనూ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం?