ప్ర‌చారం జోరు పెంచిన ప్ర‌ధాన పార్టీలు

  • ఎలాగైనా ప‌ట్టు సాధించాల‌ని బీఆర్ ఎస్‌
  • స్థానాల‌న్ని క్లీన్ స్వీప్ చేయాల‌ని కాంగ్రెస్‌
  • రెండు పార్టీలు చేసిన అభివృద్దిపై తేడాలు

హైదరాబాద్, క్రైంమిర్ర‌ర్ః

కార్పొరేష‌న్, మున్సిప‌ల్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర పడుతుండ‌డంతో ఓ వైపు అధికార పార్టీ నాయ‌కులు, మ‌రో వైపు బీఆర్ ఎస్ నాయ‌కులు ప్ర‌చారంలో మునిగి పోయారు.

తమ పార్టీల త‌రుపున నిల‌బెట్టిన అభ్య‌ర్థుల త‌రుపున వినూత్న ప్ర‌చార కార్య‌క్ర‌మాలు, తాము చేసిన అభివృద్దిపై ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తూ దూసుక‌పోతున్నారు.

గ‌తంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన అభివృద్దీ…

  • బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టణ ప్రగతి పేరుతో ఒక బృహ‌త్త‌ర‌మైన కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి ప్రధానంగా మున్సిపాలిటీల్లో పారిశుధ్యం, హరితహారం, మౌలిక సదుపాయాల మెరుగుదలే లక్ష్యంగా పనిచేశారు.
  • ప్రతి మున్సిపాలిటీకి ట్రాక్టర్లు, వైకుంఠధామాలు,  వెజ్ అండ్ నాన్ వెజ్‌ మార్కెట్లు నిర్మించడం ద్వారా పట్టణాల్లో కనీస సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యతనిచ్చారు.
    ఏర్పాటు చేశారు.

అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్‌…

  • కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టణ అభివృద్ధికి పెద్ద‌పీట వేస్తుంది. ముఖ్యంగా చెరువుల ఆక్రమణలను తొలగించడం, అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపడం రేవంత్ ప్రభుత్వ మార్క్ క‌నిపించింది.
  • అలాగే, వేల కోట్ల రూపాయలతో చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల రూపురేఖలు మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
  • కాగా ఈ రెండు పార్టీలు చేసిన అభివృద్ది, పెట్టుకున్న ల‌క్ష్యాలు బిన్న‌మైన‌వే అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు బ‌ల‌బ‌లాలు బేరీజు వేసుకుంటున్నారు. ఏదేమైన మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో హోరాహోరీపోటీ ఖాయ‌మ‌ని ప‌లువురు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button