Monday, March 2, 2026
Homeతెలంగాణఅంజన్న పుణ్య క్షేత్రం వద్ద భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన దుకాణాలు!

అంజన్న పుణ్య క్షేత్రం వద్ద భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన దుకాణాలు!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టులో అంజన్న పుణ్యక్షేత్రం ఎంతగా ప్రసిద్ధి చెందినదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి అంజన్న పుణ్యక్షేత్రం కొండగట్టులో నిన్న అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదపు ఘటనలో దాదాపు చుట్టుపక్కల ఉన్నటువంటి 30 దుకాణాలు కాలి బూడిద అయిపోయాయి. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ద్వారా ఉలిక్కిపడిన ప్రజలు వెంటనే ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించిన కూడా వారు చాలా ఆలస్యంగా వచ్చారు అని పూర్తిగా కాలిపోయిన దుకాణదారుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 30 కి పైగా దుకాణాలు అగ్నికి ఆహుతి కావడంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో ప్రాణ నష్టమైతే జరగలేదు కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగినట్లు సమాచారం. ఇక వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటినా అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అసలు ఈ ప్రమాదం సిలిండర్ పేలుడు వల్ల జరిగిందా లేక షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది. ఏది ఏమైనా కూడా ప్రముఖ ఆంజనేయ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఇటువంటి భారీ అగ్ని ప్రమాదం అర్ధరాత్రి చోటు చేసుకోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. గతంలో ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు అని… పలు అంశాల గురించి చర్చించుకుంటున్నారు. అసలు ఈ అగ్ని ప్రమాదానికి వేరే ఎవరైనా కారణమా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read also : ఇమ్యూనిటీ తక్కువగా ఉందా.. అయితే ఇవే తినండి!

Read also : డిసెంబర్ 13న హైదరాబాదులో ఫుట్బాల్ మ్యాచ్.. అంతా సిద్ధం!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments