
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:-
బంగ్లాదేశ్ దేశంలో నిన్న తీవ్ర భూకంపం సంభవించింది. ఆ భూకంపం దాటికి పలు ముఖ్య నగరాల్లోని భవనాలు తీవ్రంగా ధ్వంసం అయ్యాయి. రెక్టార్ స్కేల్ పై 5.7 తీవ్రతతో వచ్చిన భూకంపం దాటికి బంగ్లా దేశ్ ప్రజలందరూ కూడా వణికిపోయారు. బంగ్లాదేశ్ లోని ప్రముఖ నగరాలైన ఢాకా, నర్సింగిడి, నారాయన్ గంజ్ ప్రాంతాలలో శిథిలాల కింద నలిగి దాదాపు 10మంది మృతి చెందారు. మరోవైపు వందల సంఖ్యలో జనం తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారని సమాచారం అందింది. ఇప్పటికే భూకంపానికి సంబంధించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని.. ఈ భూకంపం దాటికి గాయపడినటువంటి క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారుల బృందం వెల్లడించింది. మరోవైపు బంగ్లాదేశ్ మరియు ఐర్లాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో ఉదయం 5.7 తీవ్రతతో భూకంపం రావడం తో వెంటనే మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మ్యాచ్ నిలిచిపోయింది. టెస్ట్ మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా భయంతో బయటకు పరుగులు తీశారు. ఇక ఇదే సమయంలో మన భారతదేశంలోని బెంగాల్, మిజోరం, మేఘాలయ మరియు త్రిపుర వంటి రాష్ట్రాల్లో కూడా భూమి కనిపించింది.
Read also : కోర్టు ఆదేశాల ధిక్కరణ… కంటెంప్ట్ కేసు వేస్తా : యుగంధర్ రెడ్డి
Read also : భార్య పట్టించకపోతే ఐ బొమ్మ రవి దొరికేవాడా?.. సజ్జనార్ పై తీన్మార్ మల్లన్న ఫైర్!





