
చండూరు, క్రైమ్ మిర్రర్:- చండూరు మండలం, తుమ్మలపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మునుగోడు నియోజకవర్గ ముఖ్య నేత యత్తపు మధుసూదన్ రావు కాంగ్రెస్ పార్టీలోకి దాదాపు చేరినట్లే. రెండు రోజుల క్రితమే ఆయన మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సమావేశమయ్యారు. చండూరు మండలంలో కార్యకర్తలకు నాయకులకు అండగా ఉండి.. వారిని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక ఆయన కండువ కప్పుకోవడం లాంచన ప్రాయమే. త్వరలోనే వంద, రెండు వందల మందితో కాంగ్రెస్ లోకి చేరుతారు అన్నట్టుగా సమాచారం. అయితే ఆయన వెంట ఇతర ముఖ్య నాయకులు ఎవరు వెళ్తున్నారన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి మరింత జోష్ పెరిగింది.
Read also : కీసరలో ఒక్కసారిగా మెడికల్ షాపులు మూత.. అసలు విషయం తెలిసి షాక్ అయిన ప్రజలు?
Read also : తుళ్లూరులో బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు.. “దుష్ప్రచారం చేస్తే తలలు తీసేయాలి”