తెలంగాణ

కవిత VS జగదీష్‌రెడ్డి.. కేసీఆర్‌ సపోర్ట్‌ ఎవరికి?

క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో:- ఎమ్మెల్యే కవిత – బీఆర్‌ఎస్‌ నేత జగదీష్‌రెడ్డి మధ్య డైలాగ్‌ వార్‌ ఏ స్థాయిలో జరిగిందంటే… తెలంగాణ రాజకీయాల్లో ఆ రోజు అదే హాట్‌టాపిక్‌. అయితే.. ఆ తర్వాత రియాక్షన్‌ ఏంటి…? గులాబీ బాస్‌ ఏమంటున్నారు…? కేసీఆర్‌… కూతురు వైపు మాట్లాడుతారా…? లేక సన్నిహితుడికి మద్దతుగా ఉంటారా…? అసలు ఈ విషయంలో కేసీఆర్‌ అభిప్రాయం ఏంటి…? అన్నదే ఇప్పుడు చర్చ.

Read also : కేటీఆర్‌కు రాఖీ కట్టిన లగచర్ల ఆడబిడ్డ

మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఒక ఇంటర్వ్యూలో కవిత గురించి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం… ఈ వివాదానికి కారణమైంది. కవిత గురించి స్పందిస్తూ…. బీఆర్‌ఎస్‌ను వీడి ఎవరు బయటికి వెళ్లినా.. వారికి విలువ ఉండదని అన్నారు జగదీష్‌రెడ్డి. ఆయన చేసిన ఈ కామెంట్స్‌.. కవితకు పట్టరాన్ని కోపాన్ని తెప్పించాయి. దీంతో.. ఆమె బరస్ట్‌ అయ్యారు. జగదీష్‌రెడ్డిని నోటికొచ్చినట్టు తిట్టేశారు. ఆయన్ను లిల్లీపుట్‌తో పోల్చారు కవిత. అంతేకాదు.. నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌ ఓడిపోయిందే.. ఆయన వల్ల అన్నట్టు ఘాటు విమర్శలు చేశారు. కవిత అలాంటి వ్యాఖ్యలు చేసిన వెంటనే… జగదీష్‌రెడ్డి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. ఆయనతో చర్చలు జరిపారు. అయితే.. కేసీఆర్‌ ఏం చెప్పారు…? ఎలా రియాక్ట్‌ అయ్యారు..? అన్నది మాత్రం బయటకు రాలేదు. ఆయన కూతురికి సపోర్ట్‌గా మాట్లాడారా…? లేక జగదీష్‌రెడ్డికి మద్దతు ఇచ్చారా..? అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

Read also : డిసెంబర్ లో రేవంత్ రెడ్డి అవుట్.. కొత్త సీఎం ఎవరంటే?

ఏది ఏమైనా.. జగదీష్‌రెడ్డిపై… కవిత విమర్శలు గులాబీ బాస్‌ మనస్సును నొప్పించే ఉంటాయి. ఎందుకంటే జగదీష్‌రెడ్డి ఆయనకు చాలా సన్నిహితుడు. ఓవైపు కూతురు.. మరోవైపు సన్నిహితులు.. ఇప్పుడు కేసీఆర్‌ ఎవరి వైపు ఉంటారా? అన్న చర్చ జరిగింది. అయితే.. గులాబీ మీడియా.. కేసీఆర్‌ జగదీష్‌రెడ్డి వైపు అంటూ కథనాలు రాసింది. అంతేకాదు.. కవితకు జగదీష్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చినట్టు కూడా వార్తలు ప్రచురించింది.

Read also : ఆల్ టైమ్ హైకి బంగారం ధర, తులం ఎంత అంటే?

కేసీఆర్‌ సమావేశం తర్వాత.. జగదీష్‌రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్‌ఎస్‌ పార్టీలో ఒక సైనికుడినని, కేసీఆర్‌ తరచూ కలుస్తున్నా.. కవిత గురించిన ప్రస్తావనే రాలేదన్నారు. అంటే.. బీఆర్‌ఎస్‌లో కవితకు అంత ప్రాధాన్యత లేదని ఆయన చెప్పకనే చెప్పేశారు. దీనికి కేసీఆర్‌, కేటీఆర్‌ కూడా స్పందించలేదు. అంటే… వారి అభిప్రాయం కూడా అదే అని గులాబీ మీడియా చెప్తోంది. ఇది వరుస… మరి కవిత పరిస్థితి ఏంటి…? బీఆర్‌ఎస్‌ నుంచి పూర్తిగా తప్పుకోవాల్సిందేనా…? ఇప్పుడు దీనిపై చర్చలు, డిబేట్లు జరుగుతాయేమో.

Read also : 4 నెలలుగా జీతాలు లేవు.. గద్దర్ కూతురిపై కళాకారుల తిరుగుబాటు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button