
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- మంత్రి నారా లోకేష్ ఇవాళ ఉదయం ఒక ట్వీట్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఒక బిగ్ రివిల్ విడుదల చేయబోతున్నట్లు తెలిపాడు. అయితే అన్నట్టుగానే మధ్యాహ్నం 12 గంటలకు ఆ బిగ్ రివీల్ ను విడుదల చేశారు. అదేంటంటే తన తండ్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. తన తండ్రి గారికి ప్రతిష్టాత్మక అవార్డు వచ్చినట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. “బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్” అవార్డుతో ఎకనామిక్ టైమ్స్ సమస్త ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ని సత్కరించింది అని అన్నారు. భారతదేశ సంస్కరణల ప్రయాణాన్ని ఎంతో స్పష్టత, స్థిరత్వం మరియు ధైర్యంతో తీర్చిదిద్దిన నాయకులు కొందరు మాత్రమే ఉంటారు అని అన్నారు. ఈ అవార్డు రావడం మా కుటుంబంతో పాటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గర్వకారణమైన మూమెంట్ అని తెలిపారు. ఈ అవార్డు ఆయన సంస్కరణలు, వేగం మరియు నమ్మకమైన పాలనకు నిదర్శనం అని తెలిపారు. కాగా కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటినుంచి ముఖ్యమంత్రిగా ఏపీ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే విధంగా ముందడుగు వేస్తూ ఉంటున్నారు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకుని ముందడుగు వేస్తున్నారు.
Read also : Crime: ఇంటి అద్దె అడిగినందుకు.. చంపి సూట్‌కేసులో పెట్టి..! (VIDEO)
Read also : Murder: అక్క వరుసయ్యే యువతితో ఎఫైర్.. యువకుడి దారుణ హత్య





