
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. ఒకవైపు తండ్రి మరోవైపు తనయుడు ఇద్దరు కూడా రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో ఎక్కడా కూడా రాజీ పడడం లేదు. తాజాగా పెట్టుబడులే లక్ష్యంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అలాగే తన బృందం దావోసులో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా వీరందరూ కలిసి పెట్టుబడిదారులతో విస్తృతంగా సమావేశాలను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్లను సర్వశక్తుల ఆహ్వానించడానికి.. పెట్టుబడులు పెట్టడం వల్ల రాష్ట్ర ప్రజలకు అలాగే కంపెనీలకు ఎంతటి ఉపయోగకరము అనేది కూడా వివరిస్తూ ఉన్నారు. అయితే ప్రతిసారి కూడా తెల్లటి షర్టు,నల్లటి ప్యాంటు ధరించే నారా లోకేష్ మాత్రం ఈసారి దావోస్ పర్యటనలో టీ షర్ట్ అలాగే బ్లూ పాయింట్ తో దర్శనం ఇచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. నారా లోకేష్ న్యూ లుక్ అదిరిపోయింది అంటూ సోషల్ మీడియా వేదికగా చాలామంది కూడా కామెంట్లు చేస్తూ ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు. ఈ టీషర్ట్ లో నారా లోకేష్ కాస్త స్లిమ్ గా కూడా కనిపిస్తుండడంతో… లోకేష్ అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఏది ఏమైనా కూడా లోకేష్ న్యూ లుక్ ఫొటోస్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి.
Read also : డిప్యూటీ సీఎం మాటలు నా హృదయాన్ని తాకాయి.. అందుకే అలా చేశాం : నవీన్ పోలిశెట్టి
Read also : ఉమెన్స్ ఐపీఎల్ లో RCB రికార్డు..?





