
మహేశ్వరం,క్రైమ్ మిర్రర్:- హిందూ బంధువులందరూ ప్రతిష్టాత్మకంగా జరుపుకునే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చెరువులను, ప్రకృతిని పరిరక్షించుకోవాలంటే రంగు రంగుల విష్నేశ్వరులకు స్వస్తి చెప్పి… మట్టి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని లక్ష్మారెడ్డి సూచించారు. “ప్రకృతిని నువ్వు కాపాడితే – అది నిన్ను విలయం నుంచి కాపాడుతుందని” కేఎల్ఆర్ చెప్పారు. లీడ్ ఇండియా ప్రోగ్రాం ద్వారా ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తిని, నైపుణ్య శిక్షణను రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యార్థులకు అందిస్తూనే… ప్రకృతి వనరులను ఎలా కాపాడుకోవాలని మా టీమ్ తెలియజేస్తుందని కిచ్చెన్నగారు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ,భక్తులు, యువకులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్షాలకు విద్యుత్ తీగలు, గుంతలను… స్వామి ఊరేగింపులో పసిగట్టి ప్రాణాలు కాపాడుకోవాలని కేఎల్ఆర్ విజ్ఞప్తి చేశారు. తెలియని పనులలో ఎక్కువగా నిమగ్నమవ్వకండి అని చెప్పుకొచ్చారు.
Read also : మునుగోడు ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన యుగంధర్ రెడ్డి
Read also : చల్లగా మారనున్న భూమి, ఇదీ అసలు సంగతి!