ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సంస్థల మాజీ చైర్మన్ రతన్ టాటా మరణించారు. ఈ విషయాన్ని మొదటగా హర్ష గోయెంకా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. రతన్ టాటా డిసెంబర్ 28, 1937వ సంవత్సరంలో ముంబైలో జన్మించారు. ఎన్నో వ్యాపారాలు చేసిన అనుభవం రతన్ టాటా కి కలదు. ఇది నువ్వు చనిపోవడం యావత్ భారతదేశం లో ఉన్న అందరూ కూడా జీర్ణించుకోలేనటువంటి విషయం. తన వ్యాపారాలు ద్వారా ఎంతో మందికి ఉద్యోగాలు అందించి ఎనలేనటువంటి ప్రేమానురాగాలను పొందాడు.
రతన్ టాటా గారు రెండు రోజుల క్రితమే వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కి వెళ్లి న విషయం అందరికీ తెలిసిందే. అయితే అప్పుడు ప్రతి ఒక్కరు కూడా రతన్ టాటా గారి ఆరోగ్యం విషమించడం ద్వారా ఆస్పత్రికి తీసుకువచ్చారని అందరూ చూసి మీడియా ద్వారా తెలిపారు తెగ హైలైట్ చేశారు. అయితే కేవలం వైద్య పరీక్షలు కోసమే వచ్చానని రతన్ టాటా గారు తిరిగి సమాధానం ఇచ్చారు. అయితే ప్రస్తుతం ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ధీంతో ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కి పడింది. తమ జీవితంలో ఎంతో మందికి సహాయం కూడా చేశారు. ఎంతోమంది వ్యాపారులను చూసాం కానీ రతన్ టాటా గారు ప్రజలకు ఉపయోగపడేలా చాలానే చేశారు. ఎంతో మంచి మనసు కల వారానికి రతన్ టాటా గారిని ఎంతోమంది మెచ్చుకున్నారు. అలాంటి రతన్ టాటా మరణించడం వల్ల యావత్ భారతదేశం అంతా ఆర్ఐపి రతన్ టాటా సార్ అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.