
క్రైమ్ మిర్రర్, పాలిటిక్స్ :- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత అంబటి రాంబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో వీళ్ళిద్దరి మధ్య రాజకీయంగా ఎన్నో గొడవలు జరిగాయి. ఏదో ఒక సందర్భంలోనూ అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేస్తూ ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా బ్రో సినిమా ద్వారా రాంబాబు ను ఎద్దేవా చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజి సినిమాపై కూడా అంబటి రాంబాబు సెటైరికల్ గా మాట్లాడారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా సూపర్ హిట్ అవ్వాలని అంటూనే… మరోవైపు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు పక్కన పెట్టి బాగా నటించారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన గత రెండు సినిమాలు BRO, హరిహర వీరమల్లు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోయేసరికి, ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ చాలా కృషి చేసినట్లుగా భావిస్తున్నానని ఒక వీడియోను విడుదల చేశారు.
Read also : శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఎన్ని పులులు ఉన్నాయో తెలుసా?
ఇక డిప్యూటీ సీఎం బాధ్యతలు పక్కన పెట్టి మరి ఈ సినిమా కోసం చాలా కృషి చేసినట్లు ఉన్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అవనీతి అలాగే అక్రమాల గురించి ఎన్నో మాట్లాడారు. మరి ఈరోజు OG సినిమాకి 1000 రూపాయల టికెట్ ఎందుకు పెట్టారు అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇంత దారుణంగా టికెట్ల పెంచడం అవినీతి కాదా?.. అధికార దుర్వినియోగం కాదా?.. అని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. అయితే అంబటి రాంబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. గతంలో భీమ్లా నాయక్ సమయంలో మీ పార్టీ 10 రూపాయలు, 20 రూపాయలకే టికెట్లను కావాలనే తగ్గించలేదా?.. అని ప్రశ్నిస్తున్నారు. సినిమా టికెట్ల గురించి మీరే మాట్లాడాలి అని అంబటి రాంబాబు పై జనసేన కార్యకర్తలు, జనసేన అభిమానులు సెటైర్లు వేస్తున్నారు.
Read also : ముందే మూతబడిన శివన్నగూడెం ప్రాథమిక పశువైద్య కేంద్రం..!