
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- ఒకరేమో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మరొకరేమో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి . ఇప్పటికే ఎవరి గురించి చెబుతున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కేటీఆర్ మధ్య విమర్శలు హద్దులు మీరుతున్నాయి అని కొంతమంది సోషల్ మీడియా వేదికగా వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ నాయకుడిని చెత్త నా కొడుకు అనడం… అలాగే అవతల మరో కీలక నాయకుడు అయినటువంటి కేటీఆర్ సైతం నువ్వు మగాడివైతే రా.. మగ పుట్టుక పుడితే రా… ఇలా సవాలు విసురుకుంటూ మాట్లాడడం ఏంటి అని పలువురు అభిప్రాయపడుతున్నారు. కీలక పదవుల్లో ఉన్నటువంటి నాయకులు ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడడం అవసరమా అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ప్రజలు చర్చించుకుంటున్నారు. కేవలం ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా వీరిద్దరూ ఇలాంటి వ్యాఖ్యలు చేసుకోవడం ఎంతవరకు సమంజసమో ఎవరికి అర్థం కావడం లేదు. రాష్ట్రానికి ఇద్దరు కూడా కీలకమైన నాయకులు. రేవంత్ రెడ్డి మొన్ననే ముఖ్యమంత్రి అయ్యారు. మరోవైపు కేటీఆర్ గత పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కుమారుడు. రాజకీయంలో కూడా అనుభవజ్ఞుడు. కానీ ఇద్దరు ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఉన్నా కూడా ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడడం ఏంటి అని… ఈ మాటలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయని మర్చిపోయారు అనుకుంటా అంటూ.. వీళ్ళకి రాజకీయమే అవసరం గాని.. భాషా పధజాలం గురించి అవసరం లేదు అంటూ పలువురు ఏకంగా వీరిపై ఆగ్రహిస్తూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికైనా వీరు భాషను అదుపులో పెట్టుకొని.. సక్రమంగా మాట్లాడాలి అని ఇరువురి నాయకులకు కూడా ప్రజలు సూచిస్తున్నారు. కాగా ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు చాలా ఉత్కంఠంగా మారాయి. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఇరు పార్టీల నాయకులు కూడా ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడారు.
Read also : ముగ్గురు కూతుర్ల తండ్రికి 21 లక్షల పరిహారం..! మరి ఆ లోటు ఎవరు తీర్చును?
Read also : అవకాశాలు రాకపోతే… మరీ ఇంతలా దిగజారాలా రకుల్?





