
క్రెమ్ మిర్రర్, ఎంటర్‌టైన్‌మెంట్: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక నటి పేరు హాట్ టాపిక్‌గా మారింది. ఎలాంటి గ్లామర్ షో చేయకపోయినా, వివాదాస్పద వ్యాఖ్యలు చేయకపోయినా, ఈమె గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆమె పేరు గిరిజా ఓక్. మరాఠీ సినీ రంగానికి చెందిన ఈ నటి, ఇప్పుడు ఇంటర్నెట్‌లో ట్రెండింగ్ స్టార్‌గా మారింది. కారణం ఒక సాధారణ హిందీ ఇంటర్వ్యూ.
‘కాంతార’ సినిమా నటుడు గుల్షన్ దేవయ్యతో కలిసి నటించినప్పుడు తన అనుభవాలను గిరిజా ఆ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఆ సమయంలో గుల్షన్, రొమాంటిక్ సీన్ చేయడానికి ముందు ఆమెకు సౌకర్యంగా ఉందా అని 17 సార్లు అడిగాడట. అలా ప్రొఫెషనల్‌గా, మర్యాదగా ప్రవర్తించే నటులతో పనిచేయడం చాలా సౌకర్యంగా ఉంటుందని గిరిజా చెప్పింది. ఈ చిన్న వ్యాఖ్యనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
స్కై బ్లూ చీర, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో సాధారణమైన లుక్‌లో కనిపించిన గిరిజా ఫొటోలు, వీడియోలు ట్విటర్ నుంచి ఇన్‌స్టాగ్రామ్ దాకా విస్తరించాయి. నెటిజన్లు ఆమె అందాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘ఇంత అందమైన నటి ఇప్పుడే కనిపించిందా?’ అంటూ చాలామంది రాసుకుంటున్నారు.
ALSO READ: అమ్మో.. అమ్మో.. ఈ స్నేక్ క్యాచర్ చేసిన పనికి అందరు షాక్..!
ఇక గిరిజా ఓక్ కొత్త నటి కాదు. 2004 నుంచి సినిమాలు, సీరియల్స్, వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్‌లో ఆమె మొదటి సినిమా ‘తారే జమీన్ పర్’. చిన్న పాత్ర చేసినప్పటికీ ఆ చిత్రం ఆమెకు పేరు తెచ్చింది. తర్వాత మరాఠీతో పాటు హిందీ సినిమాల్లో కూడా నటించింది. ‘షోర్ ఇన్ ది సిటీ’, ‘కాలా’, ‘జవాన్’ వంటి చిత్రాల్లో ఆమె నటన ప్రశంసలు అందుకుంది. తాజాగా ఓటీటీలో విడుదలైన ‘ఇన్‌స్పెక్టర్ జెండే’ సినిమాలోనూ ఆమె కనిపించింది.
ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో, ఆమె పాత చిత్రాల సన్నివేశాలు కూడా తిరిగి వైరల్ అవుతున్నాయి. తెలుగు నటుడు సందీప్ కిషన్‌తో గిరిజా చేసిన రొమాంటిక్ సీన్ కూడా మరోసారి చర్చకు వస్తోంది. వ్యక్తిగత జీవితంలో గిరిజా ఓక్ చాలా సింపుల్. ఆమె తండ్రి గిరీష్ ఓక్ కూడా నటుడే. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత థియేటర్‌ల ద్వారా నటనలోకి ప్రవేశించింది. అడ్వర్టైజ్‌మెంట్స్‌తో కెరీర్ ప్రారంభించి తర్వాత సినిమాల్లో అడుగుపెట్టింది. సుహ్రుద్ గోడ్బోలే అనే నిర్మాతను వివాహం చేసుకున్న గిరిజాకు ఓ కొడుకు ఉన్నాడు.
ఇన్నాళ్లుగా సినీ రంగంలో ఉన్నా, 37 ఏళ్ల వయసులో సోషల్ మీడియాలో ఇలా ఒక్కసారిగా ట్రెండ్ అవుతానని గిరిజా కూడా ఊహించకపోయి ఉంటుంది. కానీ నేడు ఆమె ఇంటర్నెట్‌లో అందరికీ సింపుల్ బ్యూటీకి ప్రతీకగా మారింది.
ALSO READ: ఐఏఎస్ అధికారిణికి శారీరక, మానసిక వేధింపులు.. తుపాకీతో బెదిరింపు!





