
క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్:- జయశంకర్ జిల్లా,మహాదేవపూర్ మండలం కాలేశ్వరం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో లక్ష తులసి దళాల అర్చన కార్యక్రమాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. లక్ష తులసి దళాల అర్చన పురస్కరించుకొని స్వామివారికి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తులసి చెట్టు ముందు దీపం వెలిగించి, తులసి గాయత్రీ మంత్రాలను 108 సార్లు జపించిన అనంతరం తులసి ఆకులను గోళ్లతో తుంచకుండా, వేళ్ళతో సహా జాగ్రత్తగా కోయాలి. సూర్యాస్తమయం తర్వాత, మధ్యాహ్నం, అర్థరాత్రి తులసిని కోయకూడదు. శ్రీమహావిష్ణువు (లేదా మీకు ఇష్టమైన దేవుడు) విగ్రహం పాదాల వద్ద తులసి దళాలను ఉంచి అర్చన చేయాలి, ఎందుకంటే తులసి విష్ణువుకు ప్రీతిపాత్రమైనది.
Read also : Good News: సంక్రాంతి కానుకగా మరో రెండు కొత్త పథకాలు..!
Read also: Shocking: ప్రెగ్నెంట్ చేస్తే రూ.10 లక్షలు!





