తెలంగాణ

కొడంగల్ దాడుల వెనుక కేటీఆర్ హస్తం!

మెడికల్ ఇన్సిట్యూట్స్, ఇంజనీరింగ్ కాలేజీలు తదితర అభివృద్ధి ప్రాజెక్టులు తీసుకవస్తుంటే.. కండ్లు మండి ఓర్వలేక బీఆర్ఎస్ కార్యకర్తలతో అధికారులపై దాడులు చేయించారని అన్నారు. ఇందుకు సుమారు రూ.1కోటి నుంచి రూ. 50లక్షల దాక కార్యకర్తలకు పంచిపెట్టారని ఆరోపించారు. రాజకీయంగా ఓర్వలేక డబ్బులు ఇచ్చి దాడులు చేయించారని విమర్శించారు.

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్, అధికారుల దాడుల వెనుక బీఆర్ఎస్ పార్టీ సూత్రదారులు ఉన్నారని, డబ్బులు పంచి దాడులు చేయించారని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం వికారాబాద్‌లో జరిగిన మీడియాతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడారు. లగచర్లలో జరిగిన అధికారులపై దాడి సభ్య సమాజం తలదించుకోవాల్సిన అంశంగా మారిందన్నారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు ఓర్వలేని పనికి నిదర్శనమన్నారు. దీని వెనుక కేసీఆర్, కేటీఆర్, హరిష్ రావులు ఉన్నారని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికి వికారాబాద్‌ జిల్లాకు బీఆర్ఎస్ పార్టీ చేసిందేమి లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు.

ఇందులో భాగంగా లగచర్లలో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. మెడికల్ ఇన్సిట్యూట్స్, ఇంజనీరింగ్ కాలేజీలు తదితర అభివృద్ధి ప్రాజెక్టులు తీసుకవస్తుంటే.. కండ్లు మండి ఓర్వలేక బీఆర్ఎస్ కార్యకర్తలతో అధికారులపై దాడులు చేయించారని అన్నారు. ఇందుకు సుమారు రూ.1కోటి నుంచి రూ. 50లక్షల దాక కార్యకర్తలకు పంచిపెట్టారని ఆరోపించారు. రాజకీయంగా ఓర్వలేక డబ్బులు ఇచ్చి దాడులు చేయించారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి జనాలలో ఆధరణ కోల్పోవడంతో కావాలనే అధికారులపై దాడులు చేయించడం దురదృష్టకరమన్నారు.

అధికారులపై దాడి చేసిన వారిని మాజీ స్పీకర్ మధుసూదన చారి, ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్, డా.మెతుకు ఆనంద్, నరేందర్ రెడ్డి, శుభప్రద్ పటేల్ లు పరామర్శించేందుకు రావడం సిగ్గుచేటన్నారు. లగచర్ల లడాయిని రాజకీయ ఉనికి కోసం రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. మునుముందు జరిగే కేటీఆర్ అరెస్టు పర్వాలను కూడా తప్పుదోవ పట్టించేందుకు రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా ఫార్మాసిటి వివాదంలో భూ బాధితులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు చదవండి .. 

ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.

కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్

సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు

ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!

రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు

రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!

ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!

రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?

పిచ్చోళ్లు గుడులపైనే దాడులు చేస్తరా.. రేవంత్ కు సంజయ్ వార్నింగ్

ఒరేయ్ కేటీఆర్.. బుల్డోజర్ తొక్కిస్తా.. రెచ్చిపోయిన కోమటిరెడ్డి

టీటీడీ జోలికొస్తే ఖబర్దార్.. ఒవైసీకి రాజాసింగ్ వార్నింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button