వరంగల్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. కేటీఆర్ ఆరోపణలను పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఔలే అని కేటీఆర్ అనడాన్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఖండించారు. కేటీఆర్ ఔలా గాళ్ల సంఘానికి అధ్యక్షుడని, ఒక ఉల్ఫా అని విరుచుకుపడ్డారు. పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ చేయలేని పనులను తాము చేస్తున్నామని..అది జీర్ణించుకోలేకే కేటీఆర్ చిల్లరగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కబ్జా చేసిన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడానికి సిగ్గుండాలంటూ నాయిని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ తిత్తి తీయాలని సీఎంకు చెప్పానని ఎమ్మెల్యే నాయిని అన్నారు. 2014లో చేసిన సకల జనుల సర్వే రిపోర్ట్ ఏమైందని సూటిగా ప్రశ్నించారు. ప్రశ్నించే స్వేచ్ఛను హరించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. ఇందిరా పార్కు ధర్నా చౌక్ ఎత్తేసింది మీరు కాదా అని నిలదీశారు. బీఆర్ఎస్ పథకాలు అన్నీ దోపిడీ చేసేందుకే తీసుకొచ్చారని దుయ్యబట్టారు. వరంగల్‌కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని, వరంగల్ అభివృద్ధిపై చర్చకు రావాలని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
ఐదేళ్లు మహిళలకు మంత్రి వర్గంలో చోటివవ్వని మీరు, మా ప్రభుత్వం గురించి మాట్లాడతారా అని ఎమ్మెల్యే నాయిని రెచ్చిపోయారు. కులగణనపై ప్రజలను రెచ్చగొట్టే వారిపై దేశద్రోహం కేసు పెట్టాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. రూపాయి ట్యాక్స్ కట్టకుండా వరంగల్‌లో బీఆర్ఎస్ కార్యాలయం నిర్వహిస్తున్నారని అన్నారు.
మరిన్ని వార్తలు చదవండి ..
ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!
రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్
త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!
ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!
రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?
పిచ్చోళ్లు గుడులపైనే దాడులు చేస్తరా.. రేవంత్ కు సంజయ్ వార్నింగ్
ఒరేయ్ కేటీఆర్.. బుల్డోజర్ తొక్కిస్తా.. రెచ్చిపోయిన కోమటిరెడ్డి
టీటీడీ జోలికొస్తే ఖబర్దార్.. ఒవైసీకి రాజాసింగ్ వార్నింగ్
20 నిమిషాల్లో బెజవాడ టు శ్రీశైలం.. ఆకాశంలో విహరిస్తూ సీ ప్లేన్ జర్నీ