తెలంగాణహైదరాబాద్

మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా!హైకమాండ్ ఆదేశాలతో రేవంత్ నిర్ణయం

తెలంగాణ మంత్రి కొండా సురేఖ పదవికి గండం వచ్చిందని తెలుస్తోంది. హైకమాండ్ ఆదేశాలతో కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని కొండా సురేఖకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారని సమాచారం. కేటీఆర్ వల్లే నాగ చైతన్య-సమంత విడిపోయారంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ విషయంలో అక్కినేని నాగార్జునను లాగారు కొండా సురేఖ. ఆయనకు కూడా కేటీఆర్ దగ్గరకు వెళ్లాలని సమంతను ఫోర్స్ చేశారని.. ఆమె ఒప్పుకోకపోవడంతో విడాకులు ఇచ్చి పంపించారంటూ సంచలన ఆరోపణలు చేశారు కొండా సురేఖ.

మంత్రిగా ఉన్న కొండా సురేఖ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. మంత్రి కొండా సురేఖపై హై కమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సినీ ప్రముఖుల పట్ల కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుబట్టారు ఢిల్లీ పెద్దలు. తెలంగాణలో అసలేం జరుగుతుందని సీనియర్లకు ఫోన్లు చేసి ఆరా తీశారని తెలుస్తోంది. అటూ మూసీ ఇటూ మూవీ.. పార్టీని ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలని క్లాస్ పీకారని సమాచారం. నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ వ్యాఖ్యలపై వివరణ కోరింది అధిష్టానం. అటు సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ పెద్దలు ఫోన్ చేసి క్లాస్ పీకారని చెబుతున్నారు. దీంతో మంత్రి పదవికి రాజీనామా చేయాలని కొండా సురేఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని సమాచారం.

Read More : రంగంలోకి కేసీఆర్.. ఆడబిడ్డలకు భరోసా

మరోవైపు కొండా సురేఖపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు అక్కినేని అమల. తన ఫ్యామిలీపై అసత్య ఆరోపణలు చేసిన కొండా సురేఖపై మండిపడ్డారు అక్కినేని అమల. రాజకీయ వివాదాల్లోకి మమ్మల్ని లాగవద్దు.. నా భర్త గురించి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు. రాజకీయ నాయకులే నేరస్థుల్లా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుంది? సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పేలా రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలని అక్కినేని అమల కోరారు.

Back to top button