
చౌటుప్పల్, క్రైమ్ మిర్రర్:- యాదాద్రి భువనగిరి జిల్లా, మునుగోడు నియోజకవర్గం, చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో 9వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి, కోమటిరెడ్డి సుశీలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. కంటి వైద్య పరీక్షలు చేయించుకుంటున్న తీరును పరిశీలించారు. వైద్య పరీక్షలు చేయించుకుంటున్న వారిలో ఎంత మంది ఆపరేషన్ లకు ఎంపిక అవుతున్నారని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వైద్య పరీక్షలు చేయించుకోడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజన వసతి కల్పించి స్వయంగా భోజనం వడ్డీంచారు. అక్కడే అందరితో కలిసి భోజనం చేశారు. ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాలకు భారీ స్పందన వస్తోంది. మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటికే నిర్వహించిన 8 ఉచిత కంటి వైద్య శిబిరాలలో 5789 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 1248 మందికి కంటి ఆపరేషన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు.
Read also : చిన్నపిల్లాడిలా ఏంటి జగన్ ఇది : హోం మంత్రి
Read also : బ్రేకింగ్ న్యూస్… లైంగికంగా వేధించాడంటూ కేఏ పాల్ పై యువత ఫిర్యాదు!