
మర్రిగూడ,క్రైమ్ మిర్రర్:- కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకై, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మర్రిగూడ మండలం రానున్నారు. పల్లెలు అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, ఎమ్మెల్యే ప్రచారం చెయ్యనున్నారు. ప్రచారంతో పాటు గ్రామాలలో ఉన్న సమస్యల గురించి, స్థానిక నాయకుల ద్వారా, ప్రజల ద్వారా తెలుసుకోనున్నారు. సరైన నాయకత్వానికి ఓటు వేసి, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను ఆయన కోరనున్నారు. మండలంలో మర్రిగూడ, వట్టిపల్లి, యరుగండ్లపల్లి, తమ్మడపల్లి గ్రామాలలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటన చెయ్యనున్నారు. ఎమ్మెల్యే ప్రచారంతో ఈ నాలుగు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, గెలిచే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. రాజగోపాల్ రెడ్డి హామీలతో గ్రామాలు ఒక్క తాటికి రానున్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
Read also : Breaking: సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కి తప్పిన ప్రమాదం..!
Read also : హైదరాబాదులో అడుగుపెట్టనున్న మెస్సి.. పూర్తి వివరాలు ఇవే?





