తెలంగాణ

సీఎం రేవంత్‌రెడ్డికి కోమటిరెడ్డి స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • పదేళ్లు తానే సీఎం అని రేవంత్‌ అనడం సరికాదు

  • ఇది కాంగ్రెస్‌ విధివిధానాలకు పూర్తిగా వ్యతిరేకం

  • రేవంత్‌ వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే కుట్ర

  • దీన్ని నిఖార్సయిన కాంగ్రెస్‌ కార్యకర్తలు సహించరు

  • రేవంత్‌ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో మొదలైన అసమ్మతి రాగాలు

క్రైమ్‌ మిర్రర్‌, హైదరాబాద్: కాంగ్రెస్‌లో వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువ. దీంతో నేతల మధ్య విభేదాలు, వివాదాలు కామన్. అయితే కొన్నాళ్లుగా స్తబ్ధుగా ఉన్న తెలంగాణ హస్తం పార్టీలో మళ్లీ లుకలుకలు మొదలైనట్లు శుక్రవారం తేటతెల్లమయిపోయాయి. ఏకంగా సీఎం వ్యాఖ్యలనే ఓ ఎమ్మెల్యే విభేదించడం ఇప్పుడు చర్చనీయాంశం.

రాజగోపాల్‌రెడ్డి కౌంటర్

పాలమూరులో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో పదేళ్ల పాటు అంటే 2034వరకు తానే సీఎంగా ఉంటానని రేవంత్‌ ప్రకటించుకున్నారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో దుమారం రేపుతున్నాయి. ఆ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. రేవంత్‌ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ విధానాలకు పూర్తిగా విరుద్ధమని మండిపడ్డారు. రేవంత్‌ వ్యక్తిగత సామ్రాజ్యాన్ని నెలకొల్పుకునేలా ప్రయత్నిస్తున్నారని, దీన్ని కాంగ్రెస్‌ కార్యకర్తలు సహించరని ట్విట్టర్‌ వేదికగా రాజగోపాల్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలతో టి.కాంగ్రెస్‌లో అసమ్మతి అలాగే ఉందని నిరూపితమైందని విశ్లేషకులంటున్నారు.

read also: 

  1. అన్యమత ఉద్యోగులపై టీటీడీ కఠిన చర్యలు

  2. బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌కు గాయాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button