ఆంధ్ర ప్రదేశ్రాజకీయం

టీడీపీకి కొరకరాని కొయ్యలా కొలికపూడి - వాట్‌ నెక్ట్స్‌..!

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరు టీడీపీకి ఇబ్బందిగా మారుతోంది. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచీ... పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు… వైసీపీ హయాంలో రాఘురామకృష్ణంరాజు పాత్ర పోషిస్తున్నారా..? సొంత పార్టీకే రెబల్‌గా మారుతున్నారా…? పార్టీ హైకమాండ్‌కే అల్టిమేటం ఇచ్చారంటే… ఆయన ఉద్దేశం ఏంటి…? తనను ఏమీ చేయలేరన్న ధీమానా…? ఏమో… కొలికపూడి తీరు చూస్తే మాత్రం అలాగే అనిపిస్తోంది.

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరు టీడీపీకి ఇబ్బందిగా మారుతోంది. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచీ… పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు ఆయన. ఏదో ఒక వివాదం సృష్టిస్తూనే ఉన్నారు. సొంత పార్టీ నేతలపైనే చర్యలకు డిమాండ్‌ చేస్తున్నారు. మహిళను వేధించిన…. స్థానిక టీడీపీ నేత, MAC మాజీ చైర్మన్‌ రమేష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అంతటితో ఆగకుండా.. పార్టీ అధిష్టానానికే అల్టిమేటం జారీ చేశారు. రమేష్‌రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే… ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని హెచ్చరించారు. పార్టీలో తాను ఉండాలో… రమేష్‌రెడ్డి ఉండాలో అధిష్టానమే నిర్ణయించాలన్నారు కొలికపూడి. ఆయన తీరుతో… టీడీపీ హైకమాండ్‌ సీరియస్‌గా ఉంది. గత 10 నెలలుగా చోటుచేసుకున్న సంఘటనలపై సమగ్ర నివేదిక తెప్పించుకున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. ఆ నివేదికను సీఎం చంద్రబాబుకు సమర్పించారు. కొలికిపూడిపై ఎలాంటి చర్య తీసుకోవాలో చంద్రబాబుదే తుది నిర్ణయమని టీడీపీ వర్గాలు తెలిపాయి.

Also Read : పోలవరం కాంట్రాక్టర్లపై సీఎం చంద్రబాబు ఆగ్రహం – బ్లాక్‌లిస్టులో పెడతానంటూ హెచ్చరిక

అయితే.. కొలికపూడి విషయంలో సీఎం చంద్రబాబు కాస్త లోతుగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనపై చర్యలు తీసుకుంటే.. దళిత నాయకుడిని ఇబ్బంది పెట్టారన్న చెడ్డపేరు వస్తుందేమో అని యోచిస్తున్నారు. చర్యలు తీసుకోకపోతే… కొలికపూడి మరింత రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి…? ఏం చేయాలన్నది… ఆలోచిస్తోంది టీడీపీ హైకమాండ్‌. కొలికపూడిపై వేటు వేస్తే… వైసీపీ హయాంలో రఘురామకృష్ణంరాజు పాత్రను… ఇప్పుడు కొలికపూడి పోషిస్తారన్న భయం కూడా టీడీపీలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే కమిటీలు, నివేదికల పేరుతో కాలయాపన చేస్తూ… ఈ విషయాన్ని పెండింగ్‌లో పెట్టొచ్చన్న చర్చ కూడా జరుగుతోంది.

ఇవి కూడా చదవండి .. 

  1. టీడీపీ, జనసేన మధ్య పెరుగుతున్న దూరం..!

  2. వెంకట్ రెడ్డి, కొండా, జూపల్లి అవుట్? కొత్తగా ఆరుగురికి అవకాశం!

  3. ఆ మంత్రి పదవి కోసం నలుగురు పోటీ – రాజగోపాల్‌రెడ్డి ఆశ నెరవేరానా?

  4. సర్పంచ్ పదవి కోసం తండ్రిని చంపించిన కూతురు.. సూర్యాపేట జిల్లాలో దారుణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button