
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- భారత దిగ్గజ క్రికెట్ ప్లేయర్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఫాలోవర్లు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇన్స్టా వేదికగా విరాట్ కోహ్లీకి కోట్ల మంది అభిమానులు,ఫాలోవర్స్ ఉన్నారు. అయితే నిన్న జరిగిన ఒక ఘటనతో విరాట్ కోహ్లీ అభిమానులు అందరూ కూడా ఒకసారిగా షాక్ అయ్యారు. అలా ఎందుకు షాక్ అయ్యారు అంటే నిన్న రాత్రి నుంచి కోహ్లీ ఇన్స్టా ఎకౌంటు ఎంత వెతికినా కూడా కనిపించలేదట. తన ఇష్టా బయోను ఓపెన్ చేయగా “యూజర్ నాట్ ఫౌండ్” అని చూపించడంతో ఫ్యాన్స్ అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. కోహ్లీ కావాలనే అకౌంట్ ను డిలీట్ చేశారా లేక ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇలా అయిందా అంటూ ప్రతి ఒక్కరు కూడా విరాట్ కోహ్లీ వైఫ్ అనుష్క శర్మకు అలాగే కోహ్లీని ఫాలో అయ్యేటువంటి ప్రముఖ వ్యక్తులకు మెసేజెస్ రూపంలో రిక్వెస్ట్ చేస్తూ ప్రశ్నలు సంధించారు. విరాట్ కోహ్లీ ఎకౌంటు కు ఏమైంది అంటూనే సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది కామెంట్ చేస్తూ ఈ విషయాన్ని వైరల్ చేశారు. అయితే ఇవాళ ఉదయం నుంచి మళ్లీ విరాట్ కోహ్లీ ఇన్స్టా అకౌంట్ యాక్టివేట్ అవ్వడంతో ఫ్యాన్స్ అందరూ కూడా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అన్నయ్య మళ్లీ వచ్చేసాడు అంటూ మీమ్స్ కూడా క్రియేట్ చేస్తూ ఆనందంలో మునిగితేలుతున్నారు. కాగా విరాట్ కోహ్లీ ఇన్స్టా వేదికగా ఒక పోస్ట్ పెట్టిన క్షణాల్లోనే లక్షకు పైగా లైక్స్ కోటికి పైగా వీవ్స్ కూడా వచ్చేవి. ఇన్స్టా వేదికగా విరాట్ కోహ్లీకి ఆదాయం కూడా భారీగానే వస్తుంది. అయితే రాత్రి నుంచి తన ఇన్స్టా ఎకౌంటు కనిపించకపోవడం పట్ల విరాట్ కోహ్లీ అయితే ఎటువంటి విధంగానూ స్పందించలేదు. కానీ ఉదయం చూసేసరికి మళ్ళీ ఇన్స్టా ఎకౌంటు యాక్టివేట్ అవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నలు సంధించడం ఆపివేశారు.
Read also : Fake Doctor: జ్వరం వచ్చిందని సూది వేశాడు.. నురగలు కక్కుకొని చనిపోయిన పేషెంట్
Read also : తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. రూ.6 లక్షల బెనిఫిట్స్





