
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. తొలి వన్డే మ్యాచ్ లో భారత్ పీకల్లోతు కష్టాల్లో ఉంది. మొదటి బ్యాటింగ్కి దిగిన రోహిత్ శర్మ, గిల్ తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ ఎనిమిది బంతులు ఆడి డక్ ఔట్ అయ్యారు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇలాంటి ఆరంభం వస్తుంది అని ఎవరూ కూడా ఊహించలేదు. రోహిత్ శర్మ 8, గిల్ 9 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఇక విరాట్ కోహ్లీ 0 పరుగులకు డక్ ఔట్ అయ్యారు. అందరూ అనుకున్నట్టుగానే వర్షం మ్యాచ్ కు అడ్డంకిగా మారుతుంది. ఇప్పటికే రెండుసార్లు వర్షం పడి మ్యాచ్ కు అంతరాయం కలగగా మరోసారి వర్షం పడటం ద్వారా ప్రస్తుతం 37 పరుగుల వద్ద వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. ప్రస్తుతం భారత్ స్కోరు 37-3 (11.5) గా ఉంది. ఆస్ట్రేలియన్ స్టార్ బౌల్లెర్స్ మిచెల్ స్టార్క్, హేజల్ వుడ్, నాదన్ ఎల్లిస్ తలా ఒక వికెట్ తీశారు. భారత జట్టు శుభారంభాన్ని రాణించకపోవడంతో ఫ్యాన్స్ అందరూ తీవ్ర నిరాశలో ఉన్నారు. మరియు ముఖ్యంగా విరాట్ కోహ్లీ జీరో పరుగులకు అవుట్ అవ్వడంతో మరింత అసహనంలో ఉన్నారు. మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందు నుంచి రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ మీదనే ప్రతి ఒక్కరు కూడా హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో వీళ్ళ పెర్ఫార్మెన్స్ లేదు.
Read also : నేడే తుది పోరు.. గెలిచే అవకాశం వీరికే ఎక్కువ?
Read also : K- RAMP ఆడించిందిగా… డబుల్ మీనింగ్స్ మైనస్