
కోదాడ,క్రైమ్ మిర్రర్ :- కోదాడకు చెందిన కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటన నేపథ్యంలో పోలీసు శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోదాడ రూరల్ సీఐ(Kodada Rural CI suspended) ప్రతాప్ లింగం ని సస్పెండ్ చేస్తూ, చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డిని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం రాత్రి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లాకప్‌లో రాజేష్ మృతి చెందిన ఘటనపై ఇప్పటికే ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ ఘటన రీత్యా అప్పటి కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డిని ఇటీవల బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రూరల్ సీఐపై కూడా చర్యలు తీసుకోవడం గమనార్హం.
Read also : నువ్వు అరెస్ట్ చేస్తే భయపడాలా.. జగన్ కు వార్నింగ్ ఇచ్చిన లోకేష్
Read also : గిల్ బ్యాడ్ లక్, ఇషాన్ కిషన్ కు అదృష్టం.. T20 వరల్డ్ కప్ జట్టు ఇదే?





