
Keerthy Suresh: ప్రముఖ నటి కీర్తి సురేశ్‌కు అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యమైన గుర్తింపులలో ఒకటి దక్కింది. ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, అంటే యూనిసెఫ్ ఇండియా విభాగం, ఆమెను సెలబ్రిటీ అడ్వకేట్‌గా నియమించింది. ఇది సినీరంగానికే కాదు, భారత దేశానికి గర్వకారణమైంది. పిల్లల మానసిక ఆరోగ్యం, వారి విద్య, భద్రత, శారీరక-భావోద్వేగ అభివృద్ధి వంటి కోణాల్లో సమాజంలో అవగాహన పెంపొందించడానికి ప్రముఖులు ముందడుగు వేయాలని యూనిసెఫ్ భావిస్తుంది.
ఈ నేపథ్యంలో, పిల్లల సమస్యలను బాధ్యతగా ఎదుర్కొంటూ వాటిపై అవగాహన కలిగిస్తారనే నమ్మకంతో కీర్తిని ఎంపిక చేశామని యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్‌కాఫ్రీ ప్రకటించారు. ప్రస్తుతం మారుతున్న సామాజిక వాతావరణంలో పిల్లలకు సరైన మార్గదర్శకత్వం, భావోద్వేగ పరిరక్షణ ఎంత ముఖ్యమో ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నప్పుడు, కీర్తి వంటి ప్రభావవంతమైన కళాకారిణి ఈ కార్యక్రమాల్లో భాగమవడం ప్రత్యేకతను సంతరించుకుంది.
కొత్త బాధ్యతపై స్పందించిన కీర్తి సురేశ్.. ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇది తన కెరీర్‌లో మాత్రమే కాదు, తన జీవితంలోనూ గౌరవప్రదమైన క్షణమని పేర్కొంది. పిల్లల శ్రేయస్సు ప్రతి ఒక్కరి ధర్మమని, వారికి సురక్షితమైన వాతావరణం కల్పించడం, వారి నైపుణ్యాలు వికసించేలా ప్రోత్సహించడం సమాజం చేసే ముఖ్యమైన కర్తవ్యమని ఆమె తెలిపారు. చిన్నారుల హక్కులను కాపాడే పనిలో ప్రచారం మాత్రమే కాదు.. నిజమైన మార్పు తీసుకురావడానికి అవసరమైన కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనే సంకల్పంతో ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు, యూనిసెఫ్ ఇండియా కూడా కీర్తి సురేశ్ తమతో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చినందుకు హర్షం వ్యక్తం చేసింది.
ALSO READ: Shocking facts: పెళ్లి చేసుకోకపోతే ముందస్తు మరణాలు..!





