
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కొడుకు ఎంగేజ్మెంట్ హైదరాబాదులో చాలా ఘనంగా జరిగింది. అయితే ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆసక్తికర సన్నివేశం ఎదురైందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఫంక్షణ్ లో జాగృతి అధ్యక్షురాలు కవిత హాజరుకావడమే. కవిత INC జెండాను పోలిన మూడు రంగుల చీర కట్టుతో బట్టి విక్రమార్క కొడుకు మరియు కోడల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. దీంతో ఆమెను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కవితను చూసిన చాలా మంది కూడా ఈమె కాంగ్రెస్ లో చేరబోతుందేమో అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చినటువంటి ఈమె వేరే పార్టీలో కలిసిపోతారు అని వార్తలు వచ్చిన సందర్భంలో వాటన్నిటిని కవిత ఖండించారు. ఇక బిజెపితో వైరం ఉన్న నేపథ్యంలో కవితకు కాంగ్రెస్ పార్టీనే దిక్కు అని మరికొందరు ఉంటున్నారు. మరి వేరే పార్టీలో కవిత చేరుతుందా లేక ఇప్పటిలానే అంతే ఉండి ప్రజల సమస్యలపై పోరాటం చేస్తారా?.. అనేది తెలియాల్సి ఉంది.
Read also : Crime: ఐస్‌క్రీం ఇచ్చి ముగ్గురు పిల్లలపై అత్యాచారం
Read also : పెళ్లి చేసుకున్న ఆస్కార్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్!





