
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిరోజు కూడా ఏవో ఒక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ జాగృతి చీఫ్ కవిత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పై తీవ్రంగా మండిపడ్డారు. ఆయన అవినీతి వల్లే వనపర్తిలో బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడింది అని ఆమె వ్యాఖ్యానించారు. ఆ తరువాత ఏకంగా నాలుగు ఫామ్ హౌస్ లు కట్టుకున్నారు అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. ఆనాటి కాలంలో ఎమ్మార్వో ఆఫీస్ ను తగలబెడితే ఎదురు తిరిగిన 32 మందిని కూడా జైలుకు పంపించారు అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యక్తిని ప్రజలు ఓడించడం కూడా కరెక్టే కదా అని కవిత వ్యాఖ్యానిస్తూనే ఇంకోసారి నా గురించి తప్పుగా మాట్లాడితే తాటతీస్తా.. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో అని కవిత హెచ్చరించిన నేపథ్యంలో తాజాగా దీనిపై నిరంజన్ రెడ్డి స్పందించారు.
Read also : పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం.. 10 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పిన సిబ్బంది!
నీ ‘తాట తీస్తా.. ఒళ్ళు జాగ్రత్త’ అని తీవ్రంగా హెచ్చరించినటువంటి కవితకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి దీటుగానే సమాధానమిచ్చారు. నువ్వు లిక్కర్ రాణివి. నువ్వు కేసీఆర్ కూతురివి కాబట్టే ఇంతవరకు కూడా ఇంకా గౌరవిస్తూనే ఉన్నాము అని.. కానీ నువ్వు కేసీఆర్ నే మానసికంగా వేధిస్తున్నావు అని తీవ్రస్థాయిలో కవితపై నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. నీకు నా గురించి మాట్లాడే అర్హత కూడా లేదు అని నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కవిత మరియు నిరంజన్ రెడ్డి మధ్య వాగ్వాదం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఊపు అందుకుంది. మరి ఇది ఇంతటితో ఆగుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.
Read also : మా ఇద్దరిదీ ఒకే రాశి.. అందుకే వైబ్ కుదిరింది : హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే





