- కొత్త పార్టీకి పరిశీలనలో రెండు పేర్లు…
- ఏప్రిల్ 25న అధికారికంగా పార్టీ ప్రకటన
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్:మాజీ సీఎం, బీఆర్ ఎస్ పార్టీ అధినేత కూతురుగా కల్వ కుంట్ల ఇక కొత్త పార్టీతో ప్రజల ముందుకు రానున్నారు. బీఆర్ ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తన మార్క్ చూపెట్టారు.లిక్కర్ గొడవతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందనే కారణంతో ఆమెను పక్కన పెట్టారు. దీంతో బీ ఆర్ ఎస్ అంతర్గత కుమ్ములాటతో తీవ్ర ఆరోపణలు చేసి సొంతంగా జాగృతి పేరుతో మున్సిపల్ ఎన్నికల్లో తన రాజకీయ చతురతో మంచి మార్కులే కొట్టేసింది. బీ ఆర్ ఎస్ పార్టీ దూరం పెట్టడం కవిత భవిష్యత్ ఏంటనే ప్రశ్నలు లేవనెత్తాయి.
దీంతో రాజకీయ పార్టీల కంటే ప్రాంతీయ ప్రాంతాలనే తెలంగాణ ప్రజలు అభివృద్ది చెందుతారని భావించి కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటన చేసింది. ఎప్పుడు పురుషులు పెట్టే పార్టీలనే చూస్తున్నాం కాని ఇక మహిళ పెట్టే పార్టీ ఎలా ఉంటుందో చూడాలని చేసిన వ్యాఖ్యలు ప్రధాన పార్టీలకు ఒక హెచ్చరిక లాంటిదే అని చెప్పవచ్చు. ముఖ్యంగా బీఆర్ ఎస్ పార్టీకి పెద్ద మైనస్ కానుందని పలువురు పేర్కొంటున్నారు.
రెండు పేర్లు పరిశీలనలో…
పార్టీ ఎంపికలో జాగృతి అధ్యక్షురాలు కల్వ కుంట్ల కవిత ఆచితూచి అడుగేస్తుంది. ప్రధానంగా తెలంగాణ ప్రజా జాగృతి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. తాజాగా సర్వోదయ తెలంగాణ అనే మరో పేరు సైతం తెరపైకి వచ్చింది. పార్టీ పేరు ప్రకటన ఏప్రిల్ 25న అధికారంగా వెలువడనుంది.
ఏప్రిల్ 25న అధికారికంగా పార్టీ పేరు…
మేడ్చల్ సమీపంలోని మునీరాబాద్‌లోని అద్వయ ఫంక్షన్హాల్లో ఏప్రిల్ 25న పార్టీ జెండా, ఎజెండాను అధికారంగా ప్రకటించనున్నట్లు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ ప్రజా జాగృతి, సర్వోదయ తెలంగాణ అనే పార్టీలు పరిశీలనలో ఉన్నప్పటికీ ఇందులో ఏదో ఒకటి 25న వెలువడనుంది. తాను పెట్టే పార్టీలో మహిళలు, యువతకు ప్రధాన్యత ఇస్తూ రాష్ర్టంలోని నీళ్లు, నిధులు, నియమకాల సమస్యలపై పార్టీ పని చేస్తుందని తెలిపారు.
అంతేగాకుండా ప్రాంతీయ సమస్యలపై, బీసీ, దళిత, గిరిజన, మైనార్టీల తరపున పోరాటాలు ఉంటాయని తెలిపారు. ఈ పార్టీ పూర్తిగా తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం పని చేస్తుందని, ఇది ‘బీ-టీమ్’ కాదని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ అంటే మా మదర్ బోర్డు అని స్పష్టం చేశారు. ఈ భారీ బహిరంగ సభకు తెలంగాణలోని ప్రతి కార్యకర్త, మహిళ, యువత పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
