Monday, March 2, 2026
Homeతెలంగాణసీఎం జిల్లాల పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేసిన కవిత?

సీఎం జిల్లాల పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేసిన కవిత?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయ నాయకులతో పాటు ప్రజలు కూడా అలర్ట్ గా ఉన్నారు. ఇక తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇక పంచాయతీ ఎన్నికలలో కూడా తమ హవాని కొనసాగించాలి అని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఎంతోమంది నాయకులు ఏకగ్రీవంగా మా పార్టీ కార్యకర్త గెలిస్తే ఆ గ్రామానికి 25 లక్షలు ఇస్తామని ప్రకటిస్తూ ఉన్నారు. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికలవేళ జిల్లాల పర్యటనకు సిద్ధం అయ్యారు. దీంతో ఇది ఏంటి అని జాగృతి అధ్యక్షురాలు కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సొమ్ముతో ప్రచారాలు చేయడం ఏంటి అని ప్రశ్నించారు. ఎన్నికలు గ్రామాల్లో ఉంటే సీఎం రేవంత్ జిల్లా కేంద్రాలకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారని అంటున్నారు. మరి ఇది ముమ్మాటికి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడం కాదా?.. అని అన్నారు. ఇక తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన విషయంలో EC జోక్యం చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను వెంటనే నిలిపివేయాలని ఆమె సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేశారు. ఇప్పటికే ఈ విషయంపై కవిత EC కి ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం.

Read also : ఈ స్కోర్ ఏంటి భయ్యా… SMAT లో రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ!

Read also : రాజధానిలో రియల్ ఎస్టేట్ మాఫియా.. షర్మిల సంచలన వ్యాఖ్యలు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments