తెలంగాణ

పెరికి చెరువును పరిశీలించిన కవిత...!

కుత్బుల్లాపూర్, క్రైమ్ మిర్రర్: కుత్బుల్లాపూర్ లోని షాపూర్ నగర్ యూపీహెచ్ సీని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం సందర్శించారు. అక్కడి పెరికి చెరువును పరిశీలించారు. 60 ఎకరాల్లో విస్తరించి ఉండాల్సిన చెరువు సగానికి పైగా కబ్జా కావడంపై కవిత ఆందోళన వ్యక్తం చేసారు.

అధ్యక్షురాలు గాజుల రామారం క్రాస్ రోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూల మాల వేసి నివాళులర్పించారు. కవిత మాట్లాడుతూ జనం బాటలో భాగంగా కుత్బుల్లాపూర్ లోని అర్బన్ ప్రైమరి హెల్త్ సెంటర్ ను ఇవాళ పరిశీలించాం.

25 ఏళ్లుగా ప్రతి ఎమ్మెల్యే ఇక్కడ వంద పడకల హాస్పిటల్ కడతామని హామీ ఇస్తున్నారు. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత టైమ్ పాస్ చేస్తున్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాదు. అన్ని పార్టీల నాయకులు కూడా ఇలాగే చేస్తున్నారని అన్నారు.

ఇక ఆశా వర్కర్లు, ఏఎన్ఎం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వారికి ఎగ్జామ్ పెట్టి కనీసం ఇప్పటి వరకు కూడా రిజల్ట్ ఇవ్వలేదు. అదే విధంగా గతంలో ఎప్పుడో రిక్రూట్ అయిన వాళ్లకు వాళ్ల సినియారిటీ ప్రకారం వెయిటేజ్ ఇవ్వాలి.

ముఖ్యంగా ఏఎన్ఎం లకు సరైన సమయానికి జీతాలు ఇవ్వాలి. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలకు ట్యాబ్ లు ఇస్తామని ఇవ్వలేదు. అర్థరాత్రి అని కూడా చూడకుండా వాళ్లను రిపోర్ట్ పెట్టాలని కోరుతున్నారని అన్నారు.
పరికి చెరువుపై మాట్లాడుతూ మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లాలో రెండో అతిపెద్ద చెరువైన పరికి చెరువును పరిశీలించాం.

ఈ చెరువు 62 ఎకరాలు ఉంటే ఇప్పుడు మాత్రం 16 ఎకరాలకు కుదించుకుపోయింది. చుట్టు పక్కల వాళ్లు చెరువు పరిరక్షణ కోసం ఎన్నో కేసులు పెట్టారు. కానీ పొలిటికల్ మేనేజ్ మెంట్ చేస్తూ చెరువు తినేశారు. దీనిలో అన్ని పార్టీల వాళ్లు ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఇళ్ల పహానీలు చూస్తే ఎఫ్టీఎల్ లో ఉన్నట్లు చూపిస్తున్నాయి.

ఎఫ్టీఎల్ లో ఉన్నప్పటికీ నిర్మాణాలకు ఎలా అనుమతిస్తున్నారు? ఎఫ్టీఎల్ అని రాసి ఉన్న రాళ్లను కూడా రియల్ ఎస్టేట్ మాఫియా భయం లేకుండా తీసేసింది. హైడ్రా కమిషనర్ గారు కచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలి. ఇక్కడి ఎమ్మెల్యే గతంలో టీడీపీ లో ఉండి బీఆర్ఎస్ లోకి వచ్చారు. రేపు ఎక్కడ ఉంటారో తెలియదు? ఆయన అండదండలతోనే చెరువు కబ్జా జరిగింది.

ఇప్పుడు నిర్మాణంలో ఉన్న చాలా ఇళ్లు ఎఫ్టీఎల్ లోనే కడుతున్నారు. హైడ్రా కమిషనర్ వాటిని కూల్చేయాలి. పేదవాళ్ల ఇళ్లే కాదు, పెద్ద వాళ్ల ఇళ్లను కూడా కూల్చేస్తామని మెసేజ్ ఇవ్వాలి. పరికి చెరువును హైడ్రా కమిషనర్ కాపాడాలని కోరుతున్నాననిఅ న్నారు. ఈ చుట్టు పక్కల అపార్ట్ మెంట్స్ ఉన్న ఉన్నాయి. వాటికి పార్క్ స్థలాన్ని రియల్ ఎస్టేట్ ఇవ్వాల్సి ఉంటుంది.

మున్సిపల్ కు ఇవ్వాల్సిన గిఫ్ట్ డీడీని కూడా వాయిలేట్ చేస్తున్నారు. అయిన సరే మున్సిపల్ అధికారులు పట్టించుకోవటం లేదు. రియల్ ఎస్టేట్ మాఫియాతో ఎందుకు అంత అండర్ స్టాండింగ్ ఉందో చెప్పాలి? పరికి చెరువు కాపాడటంలో నేను ముందుంటాను. హైడ్రా కమిషనర్ కూడా పరికి చెరువును కాపాడాలని కోరుతున్నానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button