
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఇది కార్తీక మాసం.. అందులోనూ కార్తీక పౌర్ణమి. ఈ విషయం పురుషులకు అర్థం కాకపోవచ్చు కానీ మహిళలు మాత్రం ఈరోజు ఒక పండుగల భావిస్తారు. ఎందుకంటే కార్తీక పౌర్ణమి అనేది ఎంతో విశిష్టమైనది, పవిత్రమైనది. ఇవాళ తెల్లవారుజాము నుంచే మహిళలు అందరూ కూడా నది స్నానాలు చేసి దీపాలను వెలిగించడం కూడా ప్రారంభించారు. అనంతరం కార్తిక దీపాలను వెలిగించి ఉపవాసం ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. తెల్లవారుజాము మొదలుకొని ఇప్పటికే దేవాలయాలని కూడా భక్తుల రాకతో కిటకిటలాడుతున్నాయి. కార్తీకమాసం నెలలో.. అది ప్రతిష్టమైన రోజు ఈ కార్తీక పౌర్ణమి. కాబట్టి ఈరోజు హిందూ సాంప్రదాయాలను నమ్మేటువంటి ప్రతి ఒక్కరు కూడా నది స్నానాలను ఆచరించి, దీపాలను వెలిగించి, ఉపవాసం ఉంటూ… గుళ్ళు, గోపురాలు తిరుగుతూ తమ మనసులోని కోరికలను స్వామివార్లకు తెలియజేస్తారు. కేవలం పాలు మరియు పండ్లు ఆహారంగా తీసుకుంటూ రోజు మొత్తం కూడా ఉపవాసం చేస్తారు. ఇక సాయంత్రం సమయాలలో శివాలయాలు అలాగే విష్ణు మందిరాలలో 365 వత్తులతో దీపారాధన చేయడం మంచిది అని మరో వైపు పండితులు చెబుతున్నారు. ఇక సాయంత్రం 5.15 నుంచి 7.05 గంటల మధ్య మహిళలు ఒత్తులతో దీపారాధన చేయడం చాలా మంచి జరుగుతుంది అని.. ఏడు గంటల తరువాత దీపరాధన చేసిన వెంటనే ఉపవాసం విరమించాలి అని పండితులు సూచించారు. ఇప్పటికే దీపాల వెలుగులతో దేవాలయాలన్నీ కూడా వెలిగిపోతున్నాయి.
READ ALSO : స్టార్ ప్లేయర్ ను రిలీజ్ చేయనున్న SRH జట్టు
Read also : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. నేడు కూడా ఏపీలో దంచి కొట్టనున్న వర్షాలు..





