
-
హెచ్‌సీఏ పాలకవర్గానికి 12రోజుల రిమాండ్
-
చర్లపల్లి జైలుకు తరలింపు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: ఐపీఎల్ టికెట్ల స్కామ్‌లో హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్‌మోహన్‌రావుకు మల్కాజ్‌గిరి కోర్టు 12రోజుల రిమాండ్ విధించింది. ఆయనతో పాటు హెచ్‌సీఏ పాలకవర్గ సభ్యులైన శ్రీనివాసరావు, సునీల్, రాజేందర్‌యాదవ్, కవితకు కోర్టు రిమాండ్ విధించింది. జగన్‌మోహన్‌రావు భార్య కవితను చంచల్‌గూడ జైలుకు, మిగతా నిందితులను చర్లపల్లి జైలుకు పంపారు.
Also Read : మూడవ టెస్టులో ఇంగ్లాండ్ గడ్డపై బౌలింగ్ తో అదరగొడుతున్న వైజాగ్ కుర్రోడు
ఐపీఎల్ ప్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో టికెట్ల వ్యవహారంతో పాటు, హెచ్‌సీఏ ఎన్నికల్లోనూ జగన్‌మోహన్‌రావు అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ నిర్థారించింది. శ్రీచక్ర క్లబ్ పేరుతో ఫోర్జరీ సంతకాలు సృష్టించి, ఆ పత్రాలను హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికల్లో పొందుపరిచినట్లు సీఐడీ ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో సీఐడీ బుధవారం రోజున జగన్‌మోహన్‌రావుతో పాటు ఆయన పాలకవర్గ సభ్యులను అరెస్ట్ చేసింది. నిందితులకు వైద్య పరీక్షల అనంతరం మల్కాజ్‌గిరి కోర్టులో హాజరుపరిచారు. వీరికి న్యాయస్థానం 12రోజలు రిమాండ్ విధించింది.